English | Telugu

తెలంగాణలో 531కి చేరిన పాజిటివ్ కేసులు! ఇప్ప‌ట్టి వ‌ర‌కు 16 మంది మృతి!

తెలంగాణలో పాజిటివ్‌ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతూనే వుంది. నిన్న మ‌రో ఇద్ద‌రు మ‌ర‌ణించ‌డంతో పాజిటివ్ మృతుల సంఖ్య 16కు పెరిగింది. పరిస్థితి తీవ్రతను ప్రజలు అర్థం చేసుకొని ఇళ్లకే పరిమితం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు మ‌రోసారి విజ్ఞ‌ప్తి చేశారు.

తెలంగాణలో కొత్తగా మ‌రో 28కి పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యాయి. దీంతో క‌రోనా బాధితులు 531కి పెరిగారు. చికిత్స పొందుతున్న వారిలో ఆదివారం మరో ఏడుగురు పూర్తిగా కోలుకుకోవ‌డంతో వారిని డిశ్చార్జ్ చేశారు. ఇప్ప‌ట్టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ చేసిన వారి సంఖ్య 103కి చేరిందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ లో తెలిపింది. వివిధ కొవిడ్ ఆస్పత్రుల్లో 412 మంది చికిత్స పొందుతున్నారు.