English | Telugu

నిర్మ‌ల్‌లో మర్కజ్ ప్రకంపనలు...

ఢిల్లీ మర్కజ్ కు వెళ్లొచ్చిన మహిళ భర్త నుంచి ఆమెతో పాటు ఏడాది కుమారుడికి వైరస్ సోకింది. వీరినీ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోవిడ్-19 కేసులు అధికంగా నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో కేసుల సంఖ్య 19కి పెరిగింది. వీరిలో ఇప్పటికే ఇద్దరు మరణించారు.

కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతూనే ఉండటంతో పల్లె వాసుల్లో ఆందోళన ఎక్కువైంది. వైరస్ తమను చేరకుండా ఉండాలని నిర్ణయించుకొని వారు ఊర్లకు సైతం దూరంగా వెళ్లిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కొంత మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారు. మ‌రొ కొంత మంది తమ పంట పొలాల్లో తాత్కాలికంగా టెంట్లు వేసుకొని అక్కడే నివాసం ఉంటున్నారు.