English | Telugu

శ్రీశైల పుణ్య క్షేత్రంలో బయటపడ్డ భారీ అవినీతి...

కర్నూల్ జిల్లాలో పవిత్ర పుణ్య క్షేత్రమైనటువంటి శ్రీశైలంలో అవినీతికి అడ్డా మారబోతోందా అనేది ఒక ప్రశ్నగా మిగులుతున్న పరిస్థితి కనిపిస్తోంది.శ్రీశైల దేవస్థాన పెట్రోల్ బంక్ లో అవకతవకలు జరిగాయి. ఆడిట్ లో యాభై లక్షల రూపాయల అవినీతి బయటపడింది. ఈ ఘటన పై ఆలయ ఈవో రామారావుకు తగిన చర్యలకు ఆదేశించారు. ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మీద ఆరోపణలు వస్తున్నాయి. ఆలయ ఈవో విచారణకు ఆదేశించారు. శ్రీశైలం దేవస్థానం పెట్రోల్ బంకులో అవకతవకలకు సంబంధించి ఆడిట్ లో యాభై లక్షల రూపాయల అవినీతి బయట పడింది. ఈ అంశానికి సంబంధించి విచారణ ప్రస్తుతం కొనసాగుతుంది. ఆలయ ఈవో ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మీద విచారణ ఆదేశించారు.

దీనికి సంబంధించి శ్రీశైలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామారావు ఫిర్యాదు ఇవ్వడం తోనే ఇద్దరు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు పై స్థాయి అధికారులు కానీ ఈ అవినీతిలో అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఔట్ సోర్సింగ్ కి సంబంధించిన ఉద్యోగులే కాకుండా వీరికి పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులకి కూడా సంబంధాలు ఉన్నట్టు సమాచారం అందింది. దీనికి సంబంధించి దాదాపు యాభై లక్షల రూపాయలు అవినీతి జరిగినట్టు ఆడిట్ లో బయటకు రావడంతో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైందని తెలుస్తోంది. ఔట్ సోర్సింగ్ కి సంబంధించి ఇద్దరు వ్యక్తులు ఈ అవినీతికి పాల్పడ్డారో వారిపైనా చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవో రామారావు ఆదేశించినట్లు సమాచారం ఉంది. దీనికి సంబంధించి గత నాలుగు రోజుల క్రితమే వీళ్లిద్దర్నే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారని తెలుస్తోంది. వీరితో పాటు మరి కొంతమంది ఉన్నారు వీరు ఇద్దరే ఉన్నారా లేకుంటే వీరికి సంబంధించిన పై స్థాయి అధికారులు కూడా ఈ అవినీతి బాగోతంలో ఉన్నారా అనే దానిపైనా పోలీసులు సమగ్రమైన విచారణ చేపడుతున్నట్టు సమాచారం అదుతోంది.