English | Telugu
ఏపీలో ఒక్కరోజే 16 కరోనా కేసులు నమోదు
Updated : Apr 10, 2020
శుక్రవారం జిల్లాల్లో నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 7 కరోనా కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో 5 కరోనా కేసులు, కర్నూలు జిల్లాలో 2 కరోనా కేసులు, ప్రకాశం జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో ఇప్పటివరకు కరోనా వల్ల ఆరుగురు మృతి చెందారు. కరోనా నుంచి కోలుకొని 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. వివిధ ఆస్పత్రుల్లో 365 మందికి చికిత్స అందిస్తున్నారు.
ఏపీలో జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం 15, చిత్తూరు 20, తూ.గో. 17, గుంటూరు 58, కడప 29, కృష్ణా 35, కర్నూలు 77, నెల్లూరు 48, ప్రకాశం 40, విశాఖ 20, ప.గో. జిల్లాలో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది.