English | Telugu

'డేవిడ్ రెడ్డి' గ్లింప్స్.. ఇది కదా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే..!

Publish Date:Dec 17, 2025

  భైరవం, మిరాయ్ సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మంచు మనోజ్.. 'డేవిడ్ రెడ్డి' ఫిల్మ్ తో పాన్ ఇండియా వైడ్ గా సౌండ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా విడుదలైన ఈ మూవీ గ్లింప్స్.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. (David Reddy)   మంచు మనోజ్ హీరోగా హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'డేవిడ్ రెడ్డి'. భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు 1897-1922 మధ్య కాలంలో జరిగే కథగా ఇది తెరకెక్కుతోంది. ఇందులో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడే పవర్ ఫుల్ పాత్రలో మనోజ్ నటిస్తున్నాడు.   'డేవిడ్ రెడ్డి' షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా సినిమా ఎలా ఉండబోతుందో తెలుపుతూ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. రెండున్నర నిమిషాల నిడివితో రూపొందిన ఈ గ్లింప్స్ ఆసక్తికరంగా సాగింది. బ్రిటీషర్లతో పాటు ఇండియన్స్ కి కూడా డేవిడ్ రెడ్డి శత్రువే అన్నట్టుగా చూపించారు. 'ఇండియన్ డాగ్స్' అంటూ హేళన చేసే బ్రిటీషర్స్ పాలిట 'వార్ డాగ్' అయ్యాడు అంటూ అతని పాత్రని ఎస్టాబ్లిష్ చేశారు. వార్ డాగ్ పేరుతో తయారుచేసిన పవర్ ఫుల్ బైక్, చేతిలో బ్యాట్ తో మనోజ్ కనిపించిన తీరు అదిరిపోయింది. చూస్తుంటే ఈ సినిమాతో మనోజ్ గట్టిగానే సౌండ్ చేసేలా ఉన్నాడు.   Also Read: టాలీవుడ్ లో విషాదం.. నాగార్జున దర్శకుడు మృతి.. కారణమిదే!   కాగా, 'డేవిడ్ రెడ్డి' కోసం ప్రముఖ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తుండగా.. డీఓపీగా వేణు ఆచార్య, ఎడిటర్ గా ఉజ్వల్ కులకర్ణి వ్యవహరిస్తున్నారు.   https://x.com/HeroManoj1/status/2001266741247443088?s=20  

Prabhas Fans create ruckus at The Rebel Saab Song Launch Event

Publish Date:Dec 17, 2025

Prabhas is undeniably the biggest star of indian Cinema but his fans seem to be bringing a bad name to his "Good Boy" image. At the second single, Sahana Sahana from highly anticipated horror-comedy, The Raja Saab, launch event, people witnessed unprecedented scenes. The event at Lulu Mall turned into a site of immense ruckus as hundreds of "Rebel Star" fans overwhelmed the venue to catch a glimpse of their favorite stars. The star-studded event was attended by lead actresses Nidhhi Agerwal and Riddhi Kumar, along with music composer S. Thaman, director Maruthi Dasari, producer TG Vishwa Prasad, and creative producer SKN. Addressing the massive gathering, Director Maruthi expressed immense confidence in the film’s Sankranti release, boldly declaring, "This Pongal is Rebel Pongal!"   However, the excitement quickly spiraled as the crowd breached safety barriers, causing significant congestion and minor damage to mall property. They faught with the leading ladies security teams as they surged towards them while they were leaving the Mall, post event.  While the "Rebel" mania is undeniable, industry experts and mall management have issued a plea for restraint. While celebrating their idol, fans must behave responsibly and ensure that public spaces and mall property are not damaged during such high-profile events. With the film set for a grand January 9 release, the team hopes future celebrations remain safe for all. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.   

దాసరి, రాఘవేంద్రరావు కాంబినేషన్స్‌లో 52 సినిమాలు చేసి రికార్డు క్రియేట్‌ చేసిన జయసుధ!

Publish Date:Dec 17, 2025

(డిసెంబర్‌ 17 సహజనటి జయసుధ పుట్టినరోజు సందర్భంగా..) ఒక సినిమాలో హీరో క్యారెక్టర్‌ ఎంత ప్రధానమో.. హీరోయిన్‌ క్యారెక్టర్‌కి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. పాతరోజుల్లో వచ్చిన సినిమాల్లో హీరోయిన్లు తమ నటనను ప్రదర్శించే విధంగా వారి కారెక్టర్లను డిజైన్‌ చేసేవారు. పాతతరం హీరోయిన్లు ఎంతో మంది ఆ తరహా పాత్రలు పోషించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆరోజుల్లో సావిత్రి, జమున, వాణిశ్రీ వంటి కథానాయికలు పోషించిన తరహా పాత్రలతో ఆ తర్వాతి తరంలో మంచి పేరు తెచ్చుకున్న నటి జయసుధ. అందరూ మాట్లాడుకునే స్థాయిలో ఆమె నటన ఉండేది. 1970వ దశకంలో నటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన జయసుధ చాలా తక్కువ సమయంలో వరస అవకాశాలు అందిపుచ్చుకొని నటిగా బిజీ అయిపోయారు.    ఎలాంటి పాత్రనైనా తన సహజ నటనతో రక్తి కట్టించగల సమర్థత ఉన్న జయసుధ.. ఒక దశలో హీరోయిన్‌గా టాప్‌ పొజిషన్‌కి వెళ్ళిపోయారు. ఆమె నటించిన 25 సినిమాలు ఒకే సంవత్సరం విడుదలయ్యాయి అంటే అప్పటికి ఆమె ఎంత బిజీ హీరోయినో అర్థం చేసుకోవచ్చు. నటిగా అంతటి ఉన్నత స్థానాన్ని పొందిన జయసుధ సినిమా కెరీర్‌ ఎలా ప్రారంభమైంది, ఆమె సినీ, వ్యక్తిగత జీవిత విశేషాలు ఏమిటి అనే విశేషాల గురించి తెలుసుకుందాం. జయసుధ అసలు పేరు సుజాత. 1959 డిసెంబర్‌ 17న మద్రాస్‌లో జన్మించారు. ఆమెకు ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మేనత్త అవుతారు. సుజాతకు ఊహ తెలిసే సమయానికే విజయనిర్మల రంగుల రాట్నం, పూలరంగడు, సాక్షి వంటి సినిమాలతో నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. విజయనిర్మలకు సుజాత అంటే ఎంతో ప్రేమ.. అందుకే షూటింగ్స్‌కి ఆమెను వెంట బెట్టుకొని వెళ్లేవారు. సినిమాల షూటింగ్స్‌ ఎలా ఉంటాయి, నటీనటులు కెమెరా ముందు ఎలా పెర్‌ఫార్మ్‌ చేస్తారు అనే విషయాలు చూస్తూ ఉండడం వల్ల సుజాతకు నటన పట్ల ఆసక్తి కలిగింది. తను కూడా  మేనత్తలా సినిమాలు చేసి పేరు తెచ్చుకోవాలి అనుకున్నారు.    అదే సమయంలో సూపర్‌స్టార్‌ కృష్ణను విజయనిర్మల పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తమ సొంత బేనర్‌లో పండంటి కాపురం చిత్రం నిర్మించేందుకు విజయనిర్మల సన్నాహాలు చేసుకున్నారు. లక్ష్మీదీపక్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో 12 ఏళ్ళ బాలిక కావాల్సి వచ్చింది. ఆ పాత్రను సుజాతతో చేయించాలనుకున్నారు విజయనిర్మల. అయితే దానికి ఆమె తండ్రి ఒప్పుకోలేదు. ఆయన్ని కన్విన్స్‌ చేసి ఆ సినిమాలో నటించేలా చేశారు. కృష్ణ అన్నయ్య కుమార్తెగా పండంటి కాపురం చిత్రంలో నటించారు సుజాత. 1972 ఫిబ్రవరిలో మొదటిసారి సుజాత కెమెరా ముందుకు వచ్చారు. ఈ సినిమా అదే సంవత్సరం జూలైలో విడుదలైంది.    1972 నుంచే సుజాతకు సినిమా అవకాశాలు వరసగా రావడం మొదలైంది. తెలుగు, తమిళ సినిమాల్లో ఆఫర్స్‌ వచ్చాయి. కె.బాలచందర్‌, ఆర్‌.త్యాగరాజన్‌ వంటి దర్శకులు  సుజాతకు మంచి అవకాశాలు ఇచ్చారు. అలా ఓ డజను సినిమాలు చేశారు. అప్పటికే తమిళ చిత్ర పరిశ్రమలో సుజాత పేరుతో అగ్రనటి ఉండడంతో సుజాత పేరును జయసుధగా మార్చారు ఓ రచయిత.    చదువును అశ్రద్ధ చేస్తూ సినిమాల్లో నటించడం జయసుధ తండ్రికి ఇష్టం లేకపోయినా సినిమాలపై ఆమెకు ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. 1975లో డైరెక్టర్‌ ఎన్‌.గోపాలకృష్ణ లక్ష్మణరేఖ పేరుతో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఆ సినిమాలోని కవిత పాత్రకు జయసుధ సరిపోతుందని భావించి ఆమెను ఎంపిక చేశారు. ఈ సినిమా ప్రారంభమై కొన్నాళ్ళు బాగానే షూటింగ్‌ నడిచినా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆగిపోయింది. అదే సమయంలో కె.బాలచందర్‌ అపూర్వ రాగంగళ్‌ చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ వెంటనే సోగ్గాడు చిత్రంలో మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు కె.బాపయ్య. అలా జయసుధ హీరోయిన్‌గా నటించిన మొదటి సినిమా పూర్తి కాకముందే రెండు మంచి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అవి ఘనవిజయం సాధించడంతో హీరోయిన్‌గా జయసుధ బిజీ అయిపోయారు. లక్ష్మణరేఖ చిత్రాన్ని పూర్తి చేసేందుకు డేట్స్‌ ఎడ్జస్ట్‌ చెయ్యడం కష్టం అయిపోయింది. ప్రతిరోజూ రాత్రిళ్ళు షూటింగ్‌లో పాల్గొని ఆ సినిమాను పూర్తి చేశారు జయసుధ. 1975లోనే విడుదలైన ఆ సినిమా ఘనవిజయం సాధించి జయసుధకు మంచి పేరు తెచ్చింది.    1976లో కె.రాఘవేంద్రరావు రెండో సినిమా జ్యోతి చిత్రంలో హీరోయిన్‌గా నటించారు జయసుధ. కె.రాఘవేంద్రరావు, జయసుధ కెరీర్‌లో గొప్పగా చెప్పుకోదగ్గ సినిమా జ్యోతి. ఇక అక్కడి నుంచి ఆమెకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. 1977 ఎన్టీఆర్‌, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో రూపొందిన మొదటి సినిమా అడవిరాముడులో జయసుధకు ఓ మంచి క్యారెక్టర్‌ ఇచ్చారు. ఆ సినిమా సంచలన విజయం సాధించింది. దీంతో జయసుధకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.    1980లో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి జంటగా ప్రేమాభిషేకం చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారు దాసరి నారాయణరావు. ఆ సినిమాలోని వేశ్య పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తున్న సమయంలో జయసుధ అయితే కరెక్ట్‌గా సరిపోతుందని భావించి ఆమెకు విషయం చెప్పారు దాసరి. వేశ్య పాత్ర కావడంతో చేయడానికి సంకోచించారు జయసుధ. నిడివి తక్కువే అయినా చాలా మంచి పేరు వస్తుందని దాసరి చెప్పడంతో ఆమె ఒప్పుకున్నారు. సినిమాలోని ఆమె పోర్షన్‌ను 10 రోజుల్లోనే పూర్తి చేసేశారు దాసరి. 1981లో విడుదలైన ప్రేమాభిషేకం సంచలన విజయం సాధించి కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించింది. దాసరి చెప్పినట్టుగానే శ్రీదేవి కంటే జయసుధకే ఎక్కువ పేరు వచ్చింది. ఆ తర్వాత హీరోయిన్‌గా నటిస్తూనే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల ప్రశంసలు జయసుధ.    త్రిశూలం, గృహప్రవేశం, మేఘసందేశం, అనురాగదేవత, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు, కలికాలం వంటి సినిమాలు జయసుధకు సహజనటి అని పేరు తెచ్చిన సినిమాల్లో కొన్ని మాత్రమే. ఆ తర్వాత హీరోయిన్‌గా కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అక్క, వదిన, తల్లి పాత్రలు పోషించి ఆ పాత్రలకే వన్నె తెచ్చారు. 5 దశాబ్దాలుగా వివిధ పాత్రలు పోషిస్తూ నటిగా కొనసాగుతున్న జయసుధ తన కెరీర్‌లో తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 300కిపైగా సినిమాల్లో నటించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాలు, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 25 సినిమాల్లో నటించారు. అంతేకాదు, భర్త నితిన్‌ కపూర్‌తో కలిసి జె.ఎస్‌.కె. కంబైన్స్‌ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి ఎన్నో వైవిధ్యమైన సినిమాలను నిర్మించారు.    తన సహజ నటనకుగాను ఉత్తమనటిగా 5 నంది అవార్డులు, ఉత్తమ సహాయనటిగా 4 నందులు గెలుచుకున్నారు. ఉత్తమ నటిగా 3, ఉత్తమ సహాయనటిగా 2 ఫిలింఫేర్‌ అవార్డులు, ప్రేమాభిషేకం చిత్రంలోని క్యారెక్టర్‌కు ఫిలింఫేర్‌ సెషల్‌ జ్యూరీ అవార్డు, ఫిలింఫేర్‌ లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డులు లభించాయి. ఇవికాక కళాసాగర్‌ అవార్డు, ఎఎన్నార్‌ నేషనల్‌ అవార్డు వంటి ఎన్నో అత్యున్నత అవార్డులు అందుకున్నారు జయసుధ.    జయసుధ వ్యక్తిగత విషయాలకు వస్తే.. 1982లో కాకర్లపూడి రాజేంద్రప్రసాద్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకే మనస్పర్థలు రావడంతో ఆయన నుంచి విడాకులు తీసుకున్నారు. 1985లో బాలీవుడ్‌ హీరో జితేంద్ర బంధువైన నితిన్‌ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు నిహాన్‌, శ్రేయాన్‌. జయసుధకు సేవాగుణం, దానగుణం ఎక్కువ. అందుకే ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారు. సినిమాల్లోనే కాక రాజకీయాల్లోనూ చేరి 2009లో కాంగ్రెస్‌ తరఫున సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో కొన్నాళ్ళు కొనసాగిన తర్వాత వైసీపీలో చేరారు. గత ఏడాది బీజేపీలో చేరి అందులోనే కొనసాగుతున్నారు. 

భార్యకి క్యాన్సర్, నాలుగు సర్జరీలు.. రియల్ ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకున్న షరీబ్‌  

Publish Date:Dec 16, 2025

      -షరీబ్ సినీ ప్రయాణం తెలుసా! -భార్య ఎవరు! -ఆమె పాత్ర ఏంటి     సమంత భర్త రాజ్ దర్శకత్వంలో వచ్చిన ''ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ ఇండియా వ్యాప్తంగా అన్ని భాషా ప్రేమికులని ఎంతగానో అలరించింది. మనోజ్‌ బాజ్‌పాయ్‌, సమంత కి ఎంత పేరు వచ్చిందో  జయవంత్ కాశీనాధ్ క్యారక్టర్ ని పోషించిన షరీబ్‌ హష్మి కి కూడా అంతే పేరు వచ్చింది. సదరు  క్యారక్టర్  లో తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించాడు. మిగతా రెండు సిరీస్ లోను కూడా తగ్గేదెలే   అనే విధంగా నటించి తన అభిమాన గణాన్ని పెంచుకున్నాడు. రీసెంట్ గా సోషల్ మీడియాలో  షరీబ్‌  కేవలం ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో తన తన నటనతో మెప్పించడమే కాదు, నిజ జీవితంలోను రియల్  ఫ్యామిలీ మ్యాన్  అనిపించుకున్నాడంటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన న్యూస్ చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.      షరీబ్‌ భార్య పేరు నస్రీన్‌ (Nasreen). 2003లో షరీబ్‌,నస్రీన్‌ కి మ్యారేజ్ జరిగింది. అప్పటికి ఇద్దరికి వయసు 18, 19 ఏళ్లే. సినీ రాజధాని ముంబయిలో వైవాహిక జీవితాన్నిప్రారంభించారు. షరీబ్ ఒక టెలివిజన్ ఛానల్‌లో పని చేస్తూ నటనపై మక్కువతో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసే వాడు. ఆ తర్వాత కొంత కాలానికి ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాలపై పూర్తిగా దృష్టి పెట్టాడు. కొడుకు కూడా పుట్టి ఉండటంతో నస్రీన్‌ కుటుంబ బాధ్యతను భుజానికెత్తుకుంది.     చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకురావడమే కాకుండా  షరీబ్‌ కి ఆర్ధికంగా అన్ని విధాలుగా అండగా ఉండేందుకు తన బంగారాన్ని, ఇంటికి కూడా అమ్మేసింది.ఇక ఆ తర్వాత కొన్నాళ్ళకి  స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’, ‘హాల్‌ ఇ దిల్‌’ వంటి చిత్రాల్లో షరీబ్‌ కి  చిన్న చిన్న  క్యారక్టర్  లలో అవకాశాలు వచ్చాయి.అలా ఒకవైపు సినిమాలు, మరోవైపు టీవీ సీరియల్స్  షార్ట్‌ ఫిల్మ్స్‌ ఇలా ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళాడు.ఇక సినీ  కెరీర్‌ ఊపందుకుంటున్న సమయంలో నస్రీన్‌ కి ఓరల్ క్యాన్సర్ అనే విషయం  బయటపడింది.     also read:  రెండో పెళ్లి కూడా పెటాకులేనా! పాపం ఆ డైరెక్టర్!      ఊహించని ఆ వార్తతో ఇద్దరు ఎంతో ఆవేదన చెందారు. నాలుగైదు సర్జరీలు అవ్వడంతో పాటు కీమో థెరపీ కూడా చేసారు.  కష్ట సమయంలో తనతో పాటు, కుటుంబాన్ని మోసిన నస్రీన్ కోసం షరీబ్‌ తన శక్తినంతటినీ ధారపోశాడు. షరీబ్‌ ధైర్యం, నస్రీన్‌ సంకల్పం క్యాన్సర్ మహమ్మారిని ఎదుర్కొనేలా చేశాయి.నాలుగుసార్లు క్యాన్సర్ ఆపరేషన్ జరిగినా  ప్రతి సర్జరీ తర్వాత కొంత విశ్రాంతి తీసుకుని నస్రీన్‌ ఉద్యోగానికి వెళ్ళేది.     సర్జరీలు కారణంగా ఆమె శరీరం, ముఖ ఆకృతి పూర్తిగా మారిపోయింది. తనకు ఎదురైన ప్రతి సవాల్‌ స్వీకరించడమే కాదు, ధైర్యంగా ఎదుర్కొంది. ఈ పోరాటంలో హష్మి ఆమె వెన్నంటే ఉండి నడిపించాడు. ఫలితం హష్మి, నస్రీన్‌ గెలిచారు. క్యానర్స్‌ ఓడిపోయింది. 2022 తర్వాత నస్రీన్ క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకుంది.ఇప్పుడు ఈ న్యూస్  సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ ఇచ్చిన ఉత్సాహంతో సినీ రంగంలోను షరీబ్ తనదైన శైలిలో  దూసుకుపోతు మల్హర్, ది డిప్లమేట్, మర్డర్ బాద్ , గుస్తాఖ్ ఇష్క్ ,వంటి చిత్రాల్లో  ప్రాముఖ్యత  గల  పాత్రలు పోషించాడు. ఈ  ఏడాది  కూడా  పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో  చేస్తున్నాడు.      

demon pavan vs kalyan : ఎంటర్‌టైన్‌మెంట్ లో డీమాన్ పవన్ టాప్.‌. కానీ ఓటింగ్ లో కళ్యాణ్ తోప్!

Publish Date:Dec 17, 2025

బిగ్ బాస్ సీజన్-9 లో చివరి వారం కొనసాగుతుంది. ‌మరో నాలుగు రోజుల్లో ఈ సీజన్ ముగుస్తుంది. ‌ఇక ప్రస్తుతం టాప్-5 హౌస్ లో ఉన్నారు. ఇమ్మాన్యుయేల్, డీమాన్ పవన్, తనూజ, పవన్ కళ్యాణ్ పడాల, సంజన ఈ అయిదుగురు మాత్రమే మిగిలారు. బిగ్‌బాస్ సీజన్-9లో టాస్కులు అనగానే ది బెస్ట్ ఇచ్చే వారిలో మొదటి పేరు ఖచ్చితంగా డీమాన్ పవన్‌దే అయి ఉంటుంది. ఎందుంకంటే ఫిజికల్ టాస్కుల విషయంలో డీమాన్ డామినేషన్ మాములుగా ఉండదు. ఇది ఎన్నోసార్లు ఈ సీజన్‌లో ప్రూ చేశాడు. అందుకే అతను ఇప్పుడు టాప్-5 లో ఉన్నాడు. డీమాన్ తో పాటు ఇమ్మాన్యుయేల్ కూడా అంతే రేంజ్ లో ప్రతీ టాస్క్ గెలుస్తూ వచ్చాడు. మూడు సార్లు కెప్టెన్ అయ్యాడు. పవరస్త్ర గెలిచాడు. అతడికి టాప్-3 కి అర్హుడు. ఇక సంజన.. తను అసలు ఎందుకు టాప్-5 లో ఉందో ఎవరికీ అర్థం కాదు.. గేమ్స్ ఆడలేదు..పెద్దగా ఎంటర్‌టైన్‌మెంట్ లేదు.. అయిన తను ఇంకా ఉంది అంటే అది బిగ్ బాస్ వల్లనే.. అసలు లెక్క ప్రకారం సంజన సెకెండ్ వీక్ ఎలిమినేషన్ అవ్వాలి.‌ కానీ భరణి, ఇమ్మాన్యుయేల్, తనూజ, రీతూ ముగ్గురు సాక్రిఫైజ్ చేసి తనని మళ్ళీ హౌస్ లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ అయిదుగురిలో విజేత ఎవరని మీరు అనుకుంటున్నారో వారికి మీ ఓట్ వేయండి అని బిగ్ బాస్ చెప్పగా ఆడియన్స్ ఓటింగ్ చేస్తున్నారు. అన్ అఫీషియల్ ఓటింగ్ పోల్స్ లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పడాల నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఇక పది , ఇరవై శాతం ఓటింగ్ ఢిఫరెన్స్ తో తనూజ రెండో స్థానంలో ఉంది. ఇమ్మాన్యుయేల్ మూడో స్థానంలో ఉండగా, డీమాన్ పవన్ నాల్గవ స్థానంలో ఉన్నాడు. సంజన లీస్ట్ లో ఉంది. తాజాగా రిలీజైన బిగ్ బాస్ ఎపిసోడ్ లలో డీమాన్ పవన్ ఎంటర్‌టైన్‌మెంట్ కా బాప్ అన్నట్టుగా పంచులు వేస్తున్నాడు. అందరిని నవ్విస్తున్నాడు. జెన్యున్ గా చెప్పాలంటే డీమాన్ పవన్ కి విన్నింగ్ క్వాలిటీస్ ఉన్నాయి. కానీ అతను ఎక్కడో ఆగిపోయాడు. కాదు కాదు రీతూ వెనుక పడి మిగిలిపోయాడు. అందుకే టైటిల్ రేస్ లో వెనుకబడిపోయాడు. టాప్-5 లో ఎవరికి మీ ఓట్ అని భావిస్తున్నారో కామెంట్ చేయండి.  

The Raja Saab: కామెడీ లేని రాజా సాబ్.. షాకిచ్చిన మారుతీ!

Publish Date:Dec 17, 2025

  రాజా సాబ్ గురించి ఊహించని న్యూస్ కామెడీ తక్కువ.. ఎమోషన్స్ ఎక్కువ మారుతీ మ్యాజిక్ చేస్తాడా?   ప్రభాస్, మారుతీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'ది రాజా సాబ్'(The Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ నటిస్తున్న మొదటి హారర్ ఫిల్మ్ ఇది.    'రాజా సాబ్' మూవీ హారర్ కామెడీ జానర్ లో రూపొందుతోందని మొదటి నుంచి ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ లో హారర్ ఎలిమెంట్స్ తో పాటు, ప్రభాస్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. దీంతో సంక్రాంతికి థియేటర్లలో నవ్వుల విందు ఖాయమని ప్రభాస్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.   అయితే 'రాజా సాబ్' సినిమాలో కామెడీ పెద్దగా ఉండదని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా మారుతీ సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉంటుంది. పైగా హారర్ కామెడీ అంటే.. మారుతీ మరింతగా నవ్విస్తారని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ, 'రాజా సాబ్'లో కామెడీ కంటే ఎమోషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారట.   Also Read: వారణాసి సెట్స్ కి జేమ్స్ కామెరూన్.. టైగర్ తో షూట్!   'రాజా సాబ్'లో కామెడీ సీన్స్ తక్కువేనట. ప్రభాస్ పాత్ర మాత్రమే సరదాగా ఉంటూ.. వన్ లైనర్స్ తో అక్కడక్కడా నవ్విస్తుందట. సినిమా మొత్తం ఓ ఎమోషనల్ జర్నీలా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ కి పెద్ద పీట వేశారట. ఇక పతాక సన్నివేశాలు కంటతడి పెట్టించడం ఖాయమని చెబుతున్నారు.   మారుతీ ఎమోషనల్ ఫిల్మ్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంతకాలం కామెడీ తన బలం అని నిరూపించుకున్న మారుతీ.. ఇప్పుడు ఎమోషన్స్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇందులో ఎమోషన్స్ వర్కౌట్ అయితే మాత్రం.. ఫ్యామిలీ ఆడియన్స్ 'రాజా సాబ్' చూడటానికి క్యూ కడతారు అనడంలో సందేహం లేదు.  

Rajamouli to finish Varanasi shoot by next year end

Publish Date:Dec 17, 2025

SS Rajamouli has been more silent than ever about his next movie, Varanasi. He normally tends to give updates from time to time indirectly about his films but in case of Varanasi, Priyanka Chopra did share a lot before he officially announced the title with a grand teaser.  Now, he is again maintaining silence but he clearly gave an update when Hollywood legend James Cameron asked him about the film. Recently, he watched the film Avatar: Fire and Ash and interacted with Cameron to promote the film in India. Rajamouli revealed that he liked the visual spectacle that the director managed to pull off.  During their conversation, he revealed that there is 9 months more shoot to finish and one year of it is completed. Also, he stated that he would be happy to welcome the director to his sets anytime. Jokingly, Cameron stated that he would be wishing to visit the sets if Rajamouli is working with tigers or animals.  Well, Mahesh Babu finished the shoot for Ramayana portions and he is currently preparing for a huge action sequence to be shot in specially erected sets. Once that scene shoot is over, there is talkie portion that is planned to be completed at a faster pace than a regular Rajamouli film aiming to complete shoot by next year end.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

మోగ్లీ

Publish Date:Dec 31, 1969

అఖండ 2

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969

Andhra King Taluka

Publish Date:Dec 31, 1969

Raju Weds Rambai

Publish Date:Dec 31, 1969