English | Telugu
The Raja Saab: కామెడీ లేని రాజా సాబ్.. షాకిచ్చిన మారుతీ!
Updated : Dec 17, 2025
రాజా సాబ్ గురించి ఊహించని న్యూస్
కామెడీ తక్కువ.. ఎమోషన్స్ ఎక్కువ
మారుతీ మ్యాజిక్ చేస్తాడా?
ప్రభాస్, మారుతీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'ది రాజా సాబ్'(The Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ నటిస్తున్న మొదటి హారర్ ఫిల్మ్ ఇది.
'రాజా సాబ్' మూవీ హారర్ కామెడీ జానర్ లో రూపొందుతోందని మొదటి నుంచి ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్ లో హారర్ ఎలిమెంట్స్ తో పాటు, ప్రభాస్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. దీంతో సంక్రాంతికి థియేటర్లలో నవ్వుల విందు ఖాయమని ప్రభాస్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
అయితే 'రాజా సాబ్' సినిమాలో కామెడీ పెద్దగా ఉండదని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా మారుతీ సినిమాల్లో కామెడీ ఎక్కువగా ఉంటుంది. పైగా హారర్ కామెడీ అంటే.. మారుతీ మరింతగా నవ్విస్తారని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ, 'రాజా సాబ్'లో కామెడీ కంటే ఎమోషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టారట.
Also Read: వారణాసి సెట్స్ కి జేమ్స్ కామెరూన్.. టైగర్ తో షూట్!
'రాజా సాబ్'లో కామెడీ సీన్స్ తక్కువేనట. ప్రభాస్ పాత్ర మాత్రమే సరదాగా ఉంటూ.. వన్ లైనర్స్ తో అక్కడక్కడా నవ్విస్తుందట. సినిమా మొత్తం ఓ ఎమోషనల్ జర్నీలా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ కి పెద్ద పీట వేశారట. ఇక పతాక సన్నివేశాలు కంటతడి పెట్టించడం ఖాయమని చెబుతున్నారు.
మారుతీ ఎమోషనల్ ఫిల్మ్ చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంతకాలం కామెడీ తన బలం అని నిరూపించుకున్న మారుతీ.. ఇప్పుడు ఎమోషన్స్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇందులో ఎమోషన్స్ వర్కౌట్ అయితే మాత్రం.. ఫ్యామిలీ ఆడియన్స్ 'రాజా సాబ్' చూడటానికి క్యూ కడతారు అనడంలో సందేహం లేదు.