English | Telugu
డేవిడ్ రెడ్డి మూవీలో రామ్ చరణ్..!
Updated : Dec 15, 2025
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది'(Peddi) సినిమా చేస్తున్నాడు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాను 2026 మార్చి 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీని తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఒక మూవీ చేయనున్నాడు చరణ్. ఇదిలా ఉంటే 'డేవిడ్ రెడ్డి' అనే సినిమాలో చరణ్ గెస్ట్ రోల్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న మంచు మనోజ్(Manchu Manoj).. ఏకంగా ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఏడాది 'భైరవం', 'మిరాయ్' సినిమాలతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ముఖ్యంగా 'మిరాయ్'లో బ్లాక్ స్వార్డ్ గా నెగెటివ్ రోల్ లో అదరగొట్టాడు. ఆ ఉత్సాహంతో హీరోగా 'డేవిడ్ రెడ్డి'(David Reddy) అనే పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నాడు.
Also Read: బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దిశగా అఖండ-2
హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న 'డేవిడ్ రెడ్డి' సినిమాకి హనుమ రెడ్డి దర్శకుడు. స్వాతంత్య్రం రావడానికి ముందు 1897-1922 ప్రాంతంలో జరిగిన కథగా ఇది తెరకెక్కుతోంది. ఇందులో కోలీవుడ్ హీరో శింబు కీలక పాత్ర పోషిస్తుండగా, అతిథి పాత్రలో రామ్ చరణ్ మెరవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడతాయి అనడంలో సందేహం లేదు.