మన గుండెల్లో ఎప్పటికీ నిలిచివుండే ఎవర్గ్రీన్ హీరో.. ఏఎన్నార్!
ఎనిమిదేళ్ల క్రితం - "నాకు కేన్సర్. నా శరీరంలో కేన్సర్ కణాలు ప్రవేశించాయని వైద్యులు చెప్పారు" అని అదేదో ఒక మామూలు జ్వరమన్నంత నింపాదిగా చెప్పిన జీవన తాత్వికుడు, ఎవర్ గ్రీన్ హీరో.. అక్కినేని నాగేశ్వరరావు. కళాకారుడికి రిటైర్మెంట్ లేదని నమ్మి, జీవన పర్యంతం ఆచరించి, మరి కొద్ది రోజుల్లో మరణం తప్పదని తెలిసినా, గుండె చిక్కబట్టుకొని, 'మనం' చిత్రంలో 'చైతన్య' అనే ముదుసలి పాత్రను అభినయించి, నవ్వుతూ వెళ్లిపోయిన అసాధారణ 'మనీషి'.. అక్కినేని నాగేశ్వరరావు.