Read more!

English | Telugu

ఎన్టీఆర్ కారుకు పెద్ద‌పులి ఎదురైన వేళ‌..!

 

అల‌నాటి గొప్ప హాస్య‌న‌టుల్లో ఒక‌రైన ప‌ద్మ‌నాభం ఉత్త‌మాభిరుచి క‌లిగిన మంచి ద‌ర్శ‌కుడు, నిర్మాత కూడా. రేఖా అండ్ ముర‌ళి కంబైన్స్‌ బ్యాన‌ర్‌పై ఆయ‌న నిర్మించిన తొలి సినిమాయే ఒక క్లాసిక్‌.. అది విశ్వ‌విఖ్యాత‌ నంద‌మూరి తార‌క‌రామారావు, మ‌హాన‌టి సావిత్రి జంట‌గా న‌టించిన 'దేవ‌త‌' (1965). కె. హేమాంబ‌ర‌ధ‌ర‌రావు దానికి ద‌ర్శ‌కుడు. ఆ మూవీలో వారిపై చిత్రీక‌రించిన‌ "క‌న్నుల్లో మిస‌మిస‌లు" పాట చాలా పాపుల‌ర్ అయ్యింది. ఆ పాట‌ను ఔట్‌డోర్ లొకేష‌న్ అయిన‌ సాత‌నూరులో షూట్ చేశారు. ఆ సంద‌ర్భంగా ఓ త‌మాషా ఘ‌ట‌న జ‌రిగింది.

Also read: సిరి, ష‌ణ్ణు తెలిసే చేశారు.. మాన‌స్ బ‌య‌ట‌పెట్టేశాడు!

ఆ పాట పిక్చ‌రైజేష‌న్ కోసం సావిత్రిగారు ముందుగా లొకేష‌న్‌కు వెళ్లిపోయారు. రామారావుగారిని వెంట‌బెట్టుకొని ప‌ద్మ‌నాభం ఒక కారులో రాత్రి 9 గంట‌ల‌కు మ‌ద్రాసు నుంచి బ‌య‌లుదేరారు. తిరువ‌ణ్ణామ‌లై మీదుగా సాత‌నూరు వెళ్లాలి. కారు వెనుక సీట్లో కూర్చున్న ఎన్టీఆర్, "త‌మ్ముడూ నేను ప‌డుకుంటాను. తిరువ‌ణ్ణామ‌లై రాగానే లేపండి" అని ప‌డుకున్నారు. తిరువ‌ణ్ణామ‌లై వ‌చ్చాక "అన్నగారూ.. లేవండి, తిరువ‌ణ్ణామ‌లై వ‌చ్చింది" అని లేపారు ప‌ద్మ‌నాభం. ఆయ‌న లేచి, "ఆ.. వెరీ గుడ్ బ్ర‌ద‌ర్‌.. వెరీ ఫైన్‌.. కొద్దిసేపు ఉండండి." అని కారులోంచి దిగి, అటూ ఇటూ తిరిగి వ‌చ్చి "బ్ర‌ద‌ర్‌.. పోదాం ప‌దండి" అన్నారు.

Also read: ​వంట‌ల‌క్క మ‌రిదిని బుట్ట‌లో వేసిన మోనిత‌

"అన్న‌గారూ.. మీరు ప‌డుకున్న‌ప్పుడు ఒక త‌మాషా జ‌రిగిందండీ" అన్నారు ప‌ద్మ‌నాభం.
"ఏం జ‌రిగింది బ్ర‌ద‌ర్?" అన‌డిగారు ఎన్టీఆర్‌.
"మనం చెంగ‌ల్ప‌ట్టు ద‌గ్గ‌ర‌కు వ‌స్తుండ‌గా ఒక పెద్ద‌పులి ఎదుర‌య్యింది. అది గాండ్రిస్తూ వెళ్తోంది. బ్రేక్ వేసి ఆపితే, మీరెక్క‌డ లేస్తారోన‌ని మాకు భ‌య‌మైంది. డ్రైవ‌ర్ ఏమో గ‌డ‌గ‌డా వ‌ణికాడు. పైకి నేను మామూలుగా ఉన్నా, లోప‌ల వ‌ణుకుపుట్టింది." అని చెప్పారు ప‌ద్మ‌నాభం.
"అవునా.. పులి ఎదురురావ‌డం మంచి శ‌కున‌మండీ. ఏమ‌నుకున్నారు? అరే.. న‌న్నూ లేప‌క‌పోయారా.. నేనూ చూసేవాడ్ని" అన్నారు రామారావు.
"తిరువ‌ణ్ణామ‌లై వ‌చ్చేదాకా లేపొద్దన్నారు క‌దా అన్న‌గారూ.. మాకేమో పులిని చూసేట‌ప్ప‌టికి మ‌తిపోయింది.. అయినా పులికి మేం పెద్ద‌గా భ‌య‌ప‌డ‌లేదండీ" అన్నారు ప‌ద్మ‌నాభం.
"ఎందుకు భ‌య‌ప‌డ‌లేదు బ్ర‌ద‌ర్?" అన‌డిగారు రామారావు.
"మా వెన‌కాల సింహం ప‌డుకొని ఉంటే పులికి భ‌య‌ప‌డ‌తామా అన్న‌గారూ" అన్నారు ప‌ద్మ‌నాభం.
రామారావు పెద్ద‌గా న‌వ్వేసి, "వెరీ గుడ్ బ్ర‌ద‌ర్‌.. య‌స్‌.. య‌స్" అని ప‌ద్మ‌నాభం భుజం త‌ట్టారు. అలా సాత‌నూరు వెళ్లి "క‌న్నుల్లో మిస‌మిస‌లు" పాట‌ను చిత్రీకరించుకొని వ‌చ్చారు.

https://www.youtube.com/watch?v=oR7tjb6FBoo