English | Telugu

ఆస్కార్‌ రేంజ్‌లో సినిమా చేసినా.. వారిద్దరూ కలిసి మళ్ళీ సినిమా చెయ్యడానికి 37 ఏళ్ళు పట్టింది!

మణిరత్నం.. ఈ పేరు చెబితే చాలు.. ఓ దృశ్యకావ్యం మన మనసుల్లో మెదులుతుంది. సామాజిక స్పృహ ఉన్న బాధ్యతగల పౌరులు గుర్తు వస్తారు. అల్లరి చేసే అమ్మాయిలు కళ్ళముందు ప్రత్యక్షమవుతారు. ఎన్నోరకాల భావాలు మనల్ని పులకరింపజేస్తాయి. ఒక్క దర్శకుడిలోనే ఇన్ని కోణాలు మనకు కనిపిస్తున్నాయంటే.. ఆ దర్శకుడు సామాన్యుడు కాదు అనేది అర్థమవుతుంది. మణిరత్నం సినిమాలకు ఇలాంటి ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. ప్రతి సినిమానీ ఓ కొత్త కాన్సెప్ట్‌తో రూపొందించే ఆయన తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని ఏర్పరుచుకున్నారు.