Read more!

English | Telugu

'ఆర్ఆర్ఆర్' కార‌ణంగా రూ. 75 కోట్ల మేర న‌ష్ట‌పోయిన తార‌క్‌?

 

జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ నేడు (జ‌న‌వ‌రి 7) ప్రపంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొవిడ్ కేసుల వ్యాప్తి, ప‌లు ప్రాంతాల్లో థియేట‌ర్లు మూసివేత‌, 50 శాతం ఆక్యుపెన్సీ త‌దిత‌ర ప‌లు కార‌ణాల‌తో నిర‌వ‌ధికంగా వాయిదాప‌డింది. దాంతో ఆ సినిమా కోసం సినిమా ల‌వ‌ర్స్ మ‌రికొంత‌కాలం ఎదురుచూడాల్సిన అగత్యం ఏర్ప‌డింది. తార‌క్ ఫ్యాన్స్ అయితే త‌మ హీరోను వెండితెర‌పై చూసి ఇప్ప‌టికే మూడేళ్ల‌కు పైగా గ‌డిచింది. చివ‌రిసారిగా 2018లో వ‌చ్చిన 'అర‌వింద స‌మేత‌.. వీర‌రాఘ‌వ' మూవీతో వారికి తెర‌పై ద‌ర్శ‌న‌మిచ్చాడు తార‌క్‌.

Also read: "ఊ అంటావా మావ‌" సాంగ్ కోసం సెక్సీగా స‌మంత ఎలా మారిందంటే..!

'అర‌వింద స‌మేత' త‌ర్వాత మ‌రే సినిమాకీ ఒప్పుకోకుండా ఒక్క 'ఆర్ఆర్ఆర్' మూవీకే మూడేళ్ల‌పాటు అంకిత‌మ‌య్యాడు తార‌క్‌. మ‌రోవైపు రామ్‌చ‌ర‌ణ్ ఈ సినిమాతో పాటు 'ఆచార్య' సినిమా కూడా సినిమా చేశాడు. దీంతో తార‌క్ క‌నీసం 60 కోట్ల నుంచి రూ. 75 కోట్ల‌ రూపాయ‌ల దాకా న‌ష్ట‌పోయాడ‌ని అంచ‌నా. ఈ మూడేళ్ల కాలంలో మామూలుగా అయితే అత‌ను మూడు లేదా నాలుగు సినిమాలు చేసుండేవాడు. ఒక్కో సినిమాకు యావ‌రేజ్‌గా రూ. 30 కోట్లు తీసుకుంటాడ‌నుకుంటే రూ. 120 కోట్ల దాకా అత‌ను సంపాదించి ఉండేవాడు. కానీ ఒక్క‌ 'ఆర్ఆర్ఆర్' సినిమాకే ఈ మూడేళ్లు వెచ్చించ‌డం వ‌ల్ల అత‌నికి ద‌క్కింది రూ. 45 కోట్లేన‌ని వినిపిస్తోంది. అంటే రూ. 75 కోట్ల మేర‌కు అత‌ను ఆదాయాన్ని కోల్పోయాడ‌న్న మాట‌. ఒక అంచ‌నా ప్ర‌కారం జూనియ‌ర్ ఎన్టీఆర్ నిక‌ర ఆస్తుల విలువ రూ. 440 కోట్ల దాకా ఉంటుంది. 

Also read: 'పుష్ప' కోసం అమెజాన్‌ ప్రైమ్‌ అంత చెల్లించిందా?

అదే రామ్‌చ‌ర‌ణ్ విష‌యానికి వ‌స్తే, అత‌ను రాజ‌మౌళి ప‌ర్మిష‌న్ తీసుకొని త‌న సొంత సినిమా 'ఆచార్య‌'లో న‌టించాడు. ఆ సినిమాలో చిరంజీవి టైటిల్ రోల్ పోషించ‌గా, చ‌ర‌ణ్ ఒక కీల‌క పాత్ర చేశాడు.అంటే తార‌క్‌తో పోల్చుకుంటే అత‌నికి క‌లిగిన న‌ష్టం త‌క్కువ‌.