ఆ సీరియల్కు రాశి రెమ్యూనరేషన్ ఇదే!
ఒకప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు చేసిన తెలుగమ్మాయి రాశి.. ఒకానొక దశలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, జగపతిబాబు, శ్రీకాంత్ లాంటి హీరోలతో వెండితెరపై రొమాన్స్ చేసిన రాశి 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. అగ్ర దర్శకులు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురుచూసేవారంటే ఆమె పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు.