English | Telugu

రాబోయే బిడ్డ కోసం ఇప్పటినుంచి అన్నీ రెడీ చేసుకున్న నటి లహరి

బుల్లితెర ప్రేక్షకులకు లహరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో పద్ధతైన చీర కట్టుతో అత్తగారు మెచ్చుకునే  చక్కని పొందికైన  కోడలిగా కనిపించి అలరించింది. చిన్న చిన్న కళ్ళతో చాల ముద్దుగా ఉంటుంది లహరి. ఐతే ప్రస్తుతం లహరి నటనకు కొంచెం బ్రేక్ ఇచ్చింది.ఐతే తొమ్మిదో నెల గర్భంతో ఉన్న లహరి త్వరలో బిడ్డను కనబోతున్న టైం కాబట్టి  బ్రేక్ తీసుకుని రెస్ట్ తీసుకుంటోంది.  మరి లహరికి  కుటుంబ సభ్యులు,  స్నేహితులంతా కలిసి  సీమంతం  వేడుకను నిర్వహించారు. ఇక వైఫ్ అండ్ హజ్బెండ్ ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్సుల్లో సందడి చేశారు.  లహరి సీమంతం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆట సందీప్, జ్యోతి పెర్ఫార్మెన్స్ "రోమాంచమ్" అన్న కంటెస్టెంట్స్

నీతోనే డాన్స్ ఈ వారం ప్రసారమైన ఆదివారం ఎపిసోడ్ లో ఆట సందీప్, జ్యోతి చేసిన అమేజింగ్ పెర్ఫార్మెన్స్ కి అందరూ ఫిదా ఇపోయారు. ఇక అమరదీప్ - తేజు వీళ్లకు  9 ఇచ్చారు. అమరదీప్ మాట్లాడుతూ "సందీప్ మీరు బాగా చేశారు కానీ వదిన డాన్స్ మాత్రం అంతగా అనిపించలేదు , ఎనర్జీ తగ్గిపోయింది.. లిరిక్స్ కూడా పడలేదు" అని చెప్పేసరికి. జ్యోతి, సందీప్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. "చూడండి మీరు కూడా కావాలంటే నన్ను అనుమానించొద్దు" అన్నాడు. "ఎనెర్జీ గురించి జ్యోతితో ఎవరూ మాట్లాడొద్దు..ప్లీజ్  " అన్నాడు సందీప్ "తను ఎప్పుడూ చెబుతూ ఉంటుంది తానొక మ్యారీడ్ లేడీ, ఒక బాబు ఉన్నా కూడా ఇంకా ఆమె డాన్స్ చేస్తూనే ఉంది.. నేను తన ఎనర్జీ లెవెల్స్ గురించి చెప్పిన ప్రతీసారి ఆమె ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తోంది. నేను ఇంకా ఎనెర్జీగా చేయాలంటూ తిడుతూనే ఉన్నా.. ఈ రోజు మాత్రం జ్యోతి నాకన్నా ఎనర్జిటిక్ గా చేసింది. ఇది మాత్రం నా అభిప్రాయం..నువ్వు 9 మార్క్స్ ఇచ్చినా కూడా నేను 10 మార్క్స్ గానే అనుకుంటా.. ఆమె చేయగలదు, చేస్తుంది.

నేను నోరు విప్పితే అన్ని విషయాలు బయటపడతాయి.. అసలు తెర వెనక ఏం జరుగుతోంది?

"నీతోనే డాన్స్" షోలో పవన్, నటరాజ్ మధ్య ఫైట్ పీక్స్ కి వెళ్ళిపోయింది. ఈ వారం ఒక జోడికి ఇంకో జోడి తక్కువ మార్క్స్ ఇచ్చుకుని కోట్ల మంది చూసే ఈ షోలో బాగా గొడవపడ్డారు. కొట్టుకునే  స్థాయి వరకు వెళ్ళిపోయింది. "అంజలి నీ పెర్ఫార్మెన్స్ బాలేదని నటరాజ్ మాస్టర్ అన్ని మాటలు అన్నారు" మరి నీ అభిప్రాయం ఏమిటి అని శ్రీముఖి అడిగేసరికి "డాన్స్ చేయడం కోసం వచ్చాము. ముందుగానే స్కెచ్ వేసుకుని, ప్లాన్ వేసుకుని వీళ్లకు ఇన్ని మార్క్స్ ఇవ్వాలి అని ఐతే రాలేదు ఎలా చేసినా అది అలాగే వస్తుంది" అని అంజలి నటరాజ్ మాస్టర్ ని ఉద్దేశించి కామెంట్ చేసేసరికి "అంజలి మాకు అనిపించింది చెప్పాం.. ఐనా పవన్ ఈ డిస్కషన్స్ ఏమీ వద్దు. నేను డాన్స్ కూడా చేయలేకపోతున్నా" అని నీతూ కొంచెం స్లో గానే చెప్పింది.