English | Telugu
కథక్ డాన్స్ చేసేటప్పుడు ఆడియన్స్ అవమానించారు.. అందుకే చేయను
Updated : Jul 30, 2023
శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వారం మంచి జోష్ తో ఎంటర్టైన్ చేసింది. ఇందులో పాత, కొత్త యాంకర్స్ కూడా వచ్చారు. అప్పట్లో యాంకర్ గా అలరించిన శిల్ప చక్రవర్తి కూడా వచ్చి మంచి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసారు. అలాగే భావన కూడా తన స్టయిల్లో డాన్స్ చేసి చూపించారు. ఇక వీళ్ళ డాన్స్ చూసిన ప్రీతి నిగమ్ స్టేజి మీదకు వచ్చి శిల్ప చక్రవర్తి డాన్స్ గురించి చాలా చక్కగా చెప్పారు. "శిల్ప చాలా చిన్నప్పటి నుంచే డాన్స్ చేస్తోంది..ఇంకా వండర్ ఫుల్ కథక్ డాన్సర్ కూడా" అని చెప్పేసరికి అందరూ క్లాప్స్ కొట్టారు.
తర్వాత శిల్ప చక్రవర్తి మాట్లాడుతూ "కథక్ డాన్సర్ అన్నారు కాబట్టి.. ఎప్పుడైనా.. ఎప్పుడు కథక్ టాపిక్ అనగానే నేను చాలా ఎమోషనల్ ఐపోతాను.. నేను ఫస్ట్ ప్రీతి గారిని డాన్స్ చేస్తూ చూసి ఇన్స్పైర్ అయ్యాను.. అలా నన్ను గురువు గారి దగ్గర పంపించారు. అలా నేను 8 ఏళ్ళ వయసప్పుడు నేను ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం స్టార్ట్ చేసాను. ఆ తర్వాత 17 ఏళ్ళ వయసప్పుడు నేను ఫస్ట్ టైం స్టేజి మీదకు డాన్స్ చేయడానికి వచ్చాను. నేను అప్పటికే ఇండస్ట్రీలో ఉన్నాను. ఆ టైములో మా గురువు గారు నాతో ఒక విషయం చెప్పారు. ఒక ఈవెంట్ అవుతోంది.. అందులో కథక్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయాలని అన్నారు. అప్పుడు నేను ఒక విషయం చెప్పాను ఇది క్లాసికల్ డాన్స్..ఒక మాస్ ఈవెంట్ జరగబోతోంది. అందులో కథక్ పెర్ఫార్మెన్స్ ఎలా అని అడిగాను. దానికి వాళ్ళు నన్ను బలవంతంగా తీసుకెళ్లారు. అలా నేను కథక్ డాన్స్ పెర్ఫార్మెన్స్ మొదలు పెట్టి రెండు నిమిషాలు గడిచింది. ఇంతలో వాళ్లంతా మ్యూజిక్ ఆపేసి గోలగోల చేసి, క్లాప్స్ కొట్టి నా పెర్ఫార్మెన్స్ వద్దని అరిచారు. అప్పుడు ఆ రోజు నేను కథక్ డాన్స్ చేయడాన్ని వదిలేసాను. ఆ క్షణంలో డిసైడ్ అయ్యా స్టేజి మీద కెమెరా ముందు నేను కథక్ డాన్స్ చేయకూడదు అని నిర్ణయించుకున్నా. ఈ విషయం గురించి ఎవరికీ తెలీదు, ఎవరికీ తెలియనివ్వను. కానీ ప్రస్తుతం నేను క్లాసికల్ డాన్స్ లో ఎంఏ పిహెచ్ డి చేసాను. ఇంకా రిజల్ట్స్ రాలేదు. ఒక పెర్ఫార్మెన్స్ ని అంతమంది మంది చేసేటప్పుడు అలా మ్యూజిక్ ఆపేసి వెళ్లిపొమ్మని అవమానించడం నిజంగా చాలా బాధ కలిగిస్తుంది" అని చెప్పి ఎమోషనల్ అయ్యారు శిల్ప చక్రవర్తి.