'డ్రామా జూనియర్స్' కోసం మేకప్.. ఫొటోలు షేర్ చేసిన రేణు దేశాయ్!
రేణూ దేశాయ్ బిజీగా మారారు. టీవీ రియాలిటీ షో 'డ్రామా జూనియర్స్' సీజన్ 5 షూటింగ్లో ఏప్రిల్ 5 నుంచి పాల్గొంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే ఆమె, తన తొలిరోజు షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియో క్లిప్స్‌ను షేర్ చేసుకున్నారు. తను మేకప్ వేసుకుంటున్న పిక్చర్స్‌తో పాటు, షో ఓపెనింగ్‌కు సంబంధించిన షాట్‌ను కూడా ఆమె షేర్ చేశారు.