English | Telugu

అవినాష్, అరియానా.. ఓ మామిడి తోట‌!

బాగ్‌బాస్ సీజ‌న్ 4లో ఆక‌ట్టుకున్న జోడీ అవినాష్‌, అరియానా. హౌస్‌లో క్లోస్ ఫ్రెండ్స్‌గా మారిన ఈ జంట బ‌య‌టికి వ‌చ్చాక కూడా అదే బంధాన్ని కంటిన్యూ చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. అవినాష్ మాటీవి వారు ఏడాది పాటు అవినాష్‌తో `కామెడీ స్టార్స్‌` కోసం కాంట్రాక్ట్ కుదుర్చుకోగా అత‌నితో పాటు ఆ షోలో అరియానా కూడా అడ‌పా ద‌డ‌పా మెరుపులు మెరిపిస్తోంది.

అంతే కాకుండా వీరిద్ద‌రూ క‌లిసి వీకెండ్ పార్టీల‌కు, గోవాలో వెకేష‌న్ కోసం వెళుతూ స‌ద‌రు వెకేష‌న్‌కి సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో అవి వైర‌ల్‌గా మారుతున్నాయి. తాజాగా వీరిద్ద‌రికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట సంద‌డి చేస్తోంది. ఈ వీకెండ్ ఇద్ద‌రూ క‌లిసి సిటీకి కొంత దూరంగా వున్న ఫామ్ హౌస్‌కు సంబంధించిన మామిడి తోపులో హ‌ల్ చ‌ల్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

లేటెస్ట్‌గా వీకెండ్ హాలిడేకి రిలాక్స్ కోసం ఈ జంట‌ సిటీ శివారులో వున్న ఓ ఫామ్ హౌస్‌కి వెళ్లార‌ని, అక్క‌డే వున్న ఓ మామిడి తోట‌లో ఎంజాయ్ చేశారనీ అర్థ‌మ‌వుతోంది. మామిడి తోట‌లో అవినాష్‌తో క‌లిసి న‌డుస్తూ అరియానా సెల్ఫీ వీడియో తీసుకుంది. అదే సెల్పీని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేయ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య బంధం మ‌రింత‌గా బ‌ల‌ప‌డుతోందిగా అంటూ నెటిజ‌న్స్ కామెంట్‌లు విసురుతున్నారు.

ఆ వీడియోలో "ఎక్క‌డికొచ్చాం అవినాష్?" అని ప్ర‌శ్నించింది అరియానా. "ఫామ్ హౌస్" అని చెప్పాడు అవినాష్‌. "ఏం చేస్తున్నాం మ‌న‌మిక్క‌డ‌?" అని అడిగింది అరియానా. "ఏదో మామిడి తోట చుట్టూ తిరుగుతున్నాం అలా" అని అవినాష్ చెప్ప‌డంతో, ఆ ఆన్స‌ర్ కాకుండా ఇంకేదో చెప్తాడ‌ని ఊహించిందేమో, "అయ్య‌య్యో" అని న‌వ్వేసింది అరియానా. "ఇంకా చాలా ఉన్నాయ్ ఫ్రెండ్స్‌.. చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్" అని స‌ర‌దాగా చెప్పింది అరియానా.

ఆ త‌ర్వాత "ఏం చాలా ఉన్నాయ్?" అని అవినాయ్ అడిగితే, "ఛీ ఛీ ఛీ" అంది అరియానా. ఈ వీడియోలో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా సంభాష‌ణా, అరియానా ముద్దు ముద్దు మాట‌లు వింటుంటే, ఇద్ద‌రూ చాలా స‌న్నిహితమైపోయిన‌ట్లు అనిపించ‌క మాన‌దు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.