English | Telugu

అంత ఓపిక, తీరిక లేదు...

టాలీవుడ్ లో ఉన్న ప్లే బ్యాక్ సింగర్స్ లో చెప్పుకోదగ్గ పేరు లిప్సిక..మూవీస్ లో ఎన్నో సాంగ్స్ పాడి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఎంతో మంది హీరోయిన్స్ కి ఆమె డబ్బింగ్ చెప్తూ ఉంటుంది. వీటికన్నిటికంటే కూడా సోషల్ మీడియాలో చెప్పే మోటివేషనల్ వాక్యాలకు మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది. అలాంటి లిప్సిక "చాలా గ్యాప్ వచ్చేసింది మనం మాట్లాడుకుని" కాబట్టి "ఆస్క్ మీ ఏ క్వశ్చన్" అంటూ ఇన్స్టాగ్రామ్ పేజీలోని  ఫాన్స్ కి, ఆడియన్స్ కి, నెటిజన్స్ కి అనౌన్స్ చేసేసరికి వాళ్ళు కూడా జోష్ తో చాలా ప్రశ్నలే అడిగారు.."మీరు చాలా సింపుల్ గా ఉంటారు కారణమేంటి" " మెయింటైన్ చేసేంత ఓపిక, తీరిక లేదు...నాకంత సినిమా లేదు...అందుకే సింపుల్ గా ఒక లిప్ స్టిక్ మాత్రమే పెట్టుకుంటా" అని చెప్పింది.

‘నీతోనే డాన్స్’.. సరికొత్త డాన్స్ షో త్వరలో...

డాన్స్ లవర్స్ ని ఎంటర్టైన్ చేయడానికి స్టార్ట్ మాలో సరికొత్త డాన్స్ షో రాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. ఈ కొత్త డాన్స్ షో పేరు "నీతోనే డాన్స్" . బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో బీబీ జోడి ఎలా వచ్చి హిట్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. దానికి ఇండికేషన్ గా సీరియల్ యాక్టర్స్ నిఖిల్-కావ్య చేసిన డాన్స్ నే ప్రోమోగా రిలీజ్ చేశారు. ఈ ఇద్దరూ ఐస్ క్రీం తింటూ అలా నడుస్తూ వస్తుంటే వర్షం స్టార్ట్ అవుతుంది. "నీకు గుర్తుందా..ఫస్ట్ టైం మనం కలిసి ఐస్క్రీమ్ తినేటప్పుడు కూడా ఇలాగే వర్షం పడింది..ఆ జర్నీ ఇక్కడి వరకు వచ్చింది...

ఉత్కంఠభరితంగా కృష్ణ ముకుంద సీరియల్.. అసలేం జరిగిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కృష్ణ ముకుంద మురారి. ఓ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్‌-165లో.. నీ దారి నువ్వు చూసుకోమని ముకుందతో మురారి చెప్పి కార్ లో ఇంటికి తీసుకొస్తాడు. అలా కార్ లో వస్తున్నప్పుడు మురారి  తనతో అనేసిన మాటలన్నీ గుర్తుచేసుకుంటూ ఏడుస్తుంది ముకుంద. మరోవైపు కృష్ణ ఒక్కతే తన గదిలో ఉన్న వాళ్ళ నాన్న ఫోటోతో మాట్లాడుతుంది. మా అగ్రిమెంట్ అయిపోతుంది నాన్న.. ఏసీపీ సర్ వెళ్ళిపోమంటే నేనేం చేయాలి.. నేనొక్కదాన్నే ఉండాలా? అలా కృష్ణ ఒంటరిగా మిగిలిపోయిందని అందరూ అనుకుంటారేమో అని కృష్ణ వాళ్ళ నాన్న ఫోటోతో మాట్లాడుతుంది. అప్పుడే మురారి వస్తాడు.

రిషి ప్రాణాలు కాపాడటం కోసం జగతి ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -771 లో.. రిషి గదిలోకి జగతి వస్తుంది. పడుకోని ఉన్న రిషిని చూస్తూ బాధపడుతుంది జగతి. అప్పుడే రిషికి మెలకువ వచ్చి ఉలిక్కిపడి జగతిని చూస్తాడు. మీరేంటి మేడం ఈ టైంలో.. ఇక్కడ అని అడుగుతాడు. ఆ తర్వాత జగతి దేని గురించో భయపడుతున్నట్లు అర్థం చేసుకుంటాడు రిషి.. మేడం నా గురించి మీరు ఏదైనా విషయం దాస్తున్నారా? అందుకే భయపడుతున్నారా అని రిషి అడుగుతాడు. జగతి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. నాకేం కాదు మీరు నా పక్కన ఉన్నంతవరకు నాకేం కాదని రిషి అంటాడు. ఆ తర్వాత జగతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

కళ్యాణ్ తీసిన ఆ సెల్ఫీతో రాహుల్ గుట్టు స్వప్నకి తెలిసేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -104 లో.. ఇందిరాదేవి బయట కూర్చుని అరుంధతితో మాట్లాడి లోపలికి వస్తుంది. ఒక శుభవార్త ఉందని చెప్తూ.. అరుంధతి కూతురిని ఈ ఇంట్లో ఒకరికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటుందని ఇందిరాదేవి అనగానే.. ఎవరికని ఎక్సయిట్ మెంట్ తో అడుగుతుంది రుద్రాణి. ఇంకెవరికి నీ కొడుకు రాహుల్ కి ఇద్దామని అనుకుంటుందని ఇందిరాదేవి అంటుంది. ఇలాంటి ఉమ్మడి కుటుంబంలోకి నా కూతురు కోడలిగా వస్తే హ్యాపీగా ఉంటుంది. నా ఫ్రెండ్ ఇంటికి కాబట్టి నేను ఏ భయం లేకుండా ఉండొచ్చని అరుంధతి అంటుంది.

జర్మనీలో నేహా చౌదరి కొత్త కాపురం.. అమ్మని మిస్ అవుతున్నానని ఏడుపు!

టీవి యాంకర్ గా ఫేమస్ అయిన నేహా చౌదరి.. ఐపీఎల్ కి స్టార్ స్పోర్ట్స్ తెలుగులో యాంకర్ గా చేసి  గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్నో ప్రోగ్రామ్స్ లో యాంకర్ గా చేసింది. బిగ్ బాస్ సీజన్-6 తో బాగా పాపులర్ అయింది. బిగ్ బాస్ హౌస్ మొదటి రెండు వారాలు బాగా టాస్క్ లు చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆ తర్వాత చంటితో గొడవ, ఇనయాతో గొడవ కారణంగా ఎలిమినేషన్ దగ్గరి దాకా వచ్చి సేఫ్ అయింది. అయితే రేవంత్ తో జరిగిన గొడవ ముదిరింది. అందులో అతని తప్పేం లేకున్నా రేవంత్ ని దూషించి, నోరు పారేసుకున్న నేహా.. ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక నేహాకి భారీ వెల్ కమ్ లభించింది.

నీ దారి నువ్వు చూసుకో అని ముకుందకి తేల్చిచెప్పిన మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కృష్ణ ముకుంద మురారి. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్‌-164లో.. పొద్దున్నే వాకింగ్ కి వెళ్ళి‌న మురారి గురించి ముకుంద ఎదురుచూస్తుంటుంది. ఇంతలో మురారి వస్తాడు. అప్పుడే కృష్ణ ఒక హ్యండ్ టవల్, వాటర్ బాటిల్ తీసికొచ్చి మురారికి ఇస్తుంది. దాంతో మురారి తుడ్చుకొని సోఫాలో కూర్చుంటాడు. ఆ తర్వాత కాఫీ తీసుకొస్తానని చెప్పి కృష్ణ కిచెన్ లోకి వెళ్తుంది.‌ కాసేపటికి 'మురారి.. మురారి' అని ముకుంద ఎన్ని సార్లు పిలిచినా అతను పలకకుండా.. తన మొబైల్ చూసుకుంటాడు. దాంతో అలసిపోయిన ముకుంద కోపంతో తన గదిలోకి వెళ్ళిపోతుంది.