English | Telugu

బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7 నుంచి స్టార్ట్..

బిగ్ బాస్ సీజన్ 9 లేటెస్ట్ అప్డేట్స్ ని మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి ఇస్తూ ఉన్నాడు. ఇక రీసెంట్ గా "ఏదైనా అడగొచ్చు" అంటూ నెటిజన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇచ్చాడు. " బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7 నుంచి స్టార్ట్ అవుతుంది.

నాకు మళ్ళీ బిగ్ బాస్ ఛాన్స్ రావొచ్చు, పోవచ్చు అనుకుంటా. నా ఫామిలీ నా లక్కీ. ఈసారి బిగ్ బాస్ రివ్యూస్ గట్టిగా చేద్దామనుకుంటున్నా..ఈసారి ఒక రూమ్ లో ఉంటా పని చేసుకుంటూ పోతా .ఒక్కరితో కూడా టచ్ లో ఉండకూడదు అండ్ ఎవడిని పట్టించుకోకూడదు అనుకుంటున్నా అందుకే నేను నా కాంటాక్ట్స్ కూడా మార్చేసా." అని చెప్పాడు. ఇక మరో నెటిజన్ "పికిల్స్ రమ్య గురించి వాళ్ళ రియల్ లైఫ్ లో చాలా తక్కువ చేసి మాట్లాడింది..ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉంటుందో ఏంటో" అనేసరికి "మాట్లాడింది వాళ్ళ అక్క కదా" అన్నాడు ఆదిరెడ్డి. "బిగ్ బాస్ టైంలో 99 % బాడ్ కామెంట్స్ పిఆర్ కామెంట్స్ కాబట్టి నేను వాటిని పెద్దగా పట్టించుకోను." అన్నాడు. ఇక తన లైఫ్ గురించి అడిగిన ప్రశ్నకు "లైఫ్ లో ఒక్కసారైనా నా హైట్ కి తగ్గట్టు బాడీని పెంచాలి..వ్యవసాయం చేయాలి..నా పిల్లల్ని మంచి పొజిషన్ లో చూడాలి" అన్నాడు. ఇక మూవీస్, సీరియల్స్ లో యాక్టింగ్ గురించి వచ్చిన ప్రశ్నకు "నన్ను మూవీస్ అండ్ సీరియల్స్ లో అడిగారు. రీసెంట్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒకరు ఒక మూవీలోకి అడిగారు. అలాగే జెమినిలో ఒక సీరియల్ కి అడిగారు. ఈటీవీలో కూడా యాక్టింగ్ రిలేటెడ్ అడిగారు. కానీ నేను నో చెప్పాను. నాకు తెలియని దానిలో దూరాలని అనుకోవట్లేదు. ఐనా నాకు కూడా అంత సీన్ లేదనే నమ్ముతా. ఫ్యూచర్ లో ఏమో" అన్నాడు. "ఎవరినీ నమ్మొద్దు..నమ్మిన వాళ్ళను మోసం చేయద్దు..నేను చాల మందిని నమ్మి ఘోరంగా మోసపోయా అందుకే ఆ విషయంలోనే రిగ్రెట్ ఫీలవుతా..నా లా పరీక్షలు ఇంకో ఆరు రోజుల్లో ఉన్నాయి" అంటూ నెటిజన్స్ ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.