Facebook Twitter
గోదావరి పుష్కరాల కవితలు

 

గోదావరి పుష్కరాల కవితలు



గోక్షీర సమామృత సుజల గోదావరి
దాహార్తికి హారతిచ్చి స్వాగతించు తన దరి
వడి వడి జల గల గలలు ఓ విభావరి
రివాజుగా వచ్చె పన్నెండేళ్ళ పుష్కరాలు ఈ సారీ

... Srikanth Vetsa

// మేం మనుషులం //
గోదాములు నిండుతాయని గోదావరి పుష్కర తీర్థానికి పయనిస్తాం..
దానవ దుష్కృతులనంతము చేసి పాప నిష్కృతికై మునకలు వేస్తాం..
వరమో శాపమో తెలియని మోక్షం కోసం ఏడుస్తూ తొక్కిసలాటలో చస్తాం...
రివాజుగా మారిన అలసత్వం, అవినీతి, కామాంధత్వాలను మాత్రం కడిగేసుకోం - మేం మనుషులం..

--- Bhargav Kumar Burugupalli

గోదావరి శోభలు, పుష్కరాల గోలలు, గో
దావరిలో స్నానం,దానములిచ్చు జనం, గోదా
వరిలో నావ, చూపించు నాకు త్రోవ,  గొదావ
రిఝరి,కోరి వెళ్ళిరి లోకులు మరీ మరీ

... Rambabu Kaipa

"గో"రు ముద్దలు పెడుతూ ముద్దాడింది అమ్మ ,
"దా"యిదాయి అంటూ దగ్గరకి తీసుకుంది అమ్మ !
"వ"టపత్రశాయికి వలె నిదురపుచ్చింది అమ్మ ,
"రి"వాజుగా వచ్చే పుష్కర పుణ్యాన్ని పంచింది  గోదారమ్మ !!

... Vadlamani Lalitha Swapna

గోరింటాకు పెట్ట అర చేయి మెరిసె, మన గో
దావరి తల్లి ఈనాడు పుష్కరము న మెరిసె !!
వరముల యమ్మ మన ముందు నిలిచి మన ప
రివారముల్ జేరి కొలవంగా ఆ తల్లి మురిసె

.... Viswanath K

గోమాత సేవలో వచ్చు పుణ్యంబు
దానము వల్ల వచ్చు విశేషంబు
వందనము వలన వచ్చు గౌరవంబు
రిప్త హరిణి గోదావరి పుష్కరంబో రవీంద్రా !

.. Ravindra Tanugula

 

.....Telugu Velugu Samithi

Infosys Hyderabad