దేవాలయం....
దేవాలయం....

ఆలింగనం చేసుకున్న ఆరాధనలకి
ప్రతి రూపంగా ...కనుల ఎదుట నిలిచే..
ఆ ఆదైవం కొలువున్న కోవెల...
కైమోడ్చినంతనే...ఆశిస్సులనందిచే ఆలయం..
గోపురం దగ్గరే..పవిత్రతను సంతరించుకొని
దర్శనం తోనే మనసుకు శాంతి నోసగుతూ..
గడపలోని గంభీరతని కళ్ళ కద్దుకుని..
లోనికి అడుగిడినంతనే...అణువు.. అణువు..
అభయప్రదాతను చేరుకున్న అనుభూతులను
అందించి స్వాంతన పరిచేదే దేవాలయం...
ప్రణామములతో హృదయాన నెలకొన్న దైవం
ఎదుట నిలిచి హారతుల ఆత్మసమర్పణ నొసగుతూ
నివేదనల నిరాజనాలతో..పూజలందుకొనే
ఆ సర్వాంతర్యామి సన్నిధే..దేవాలయం....!!
- సుజాత తిమ్మన
sujatha1207@gmail.com



