తాళి...
తాళి...
.png)
తొవ్వకుండానే...
గుండెలోనికి చొచ్చుకొనిపోయి
తనచుట్టూ గుడి కట్టేసుకుని.....
తానే దైవమై
నిలబడుతుంది..
తాళి...
సహనాన్ని దారాదత్తతం
చేస్తూ....
పైటచాటు నుండి
దోబూచులాడ్తూ..
సాంప్రదాయపు కంచెను
కంచుకోటలా నిర్మించేస్తుంది
తాళి...
అడుగు అడుగుకూ...
లక్షమణరేఖ గీస్తూ..
అలంకారంగా అమ్మాయిని చేరి
అతివని చేసి
తాను ఆరోప్రాణమవుతుంది
తాళి...
శ్వాసించిన ప్రతీసారీ..
నీకు నేనున్నానని
గుర్తు చేస్తూ....
మూడు ముళ్ళ భందమే అయినా..
ఏడేడూ జన్మల
అనుభందాలకి బాష్యమై నిలిచి
చెదిరిపోని ముత్తైదుతనాన్ని
సంస్కరిస్తుంది ...
తాళి...
సుజాత తిమ్మన...
sujatha1207@gmail.com



