Facebook Twitter
తడిసిన పల్లె

తడిసిన పల్లె

 

ఉరుములు, మెరుపులతో
కారుమబ్బులు కమ్ముకున్నాయి
వానచినుకులు మొదలయ్యాయి
చినుకుచినుకు కలిసి వరదై పారింది
నా పల్లె ఇప్పుడు
చూడముచ్చటగా తడిసి ముద్దయింది
వాగువంక చేయిచేయి కలిపి
నదీమతల్లి తొక్కేపరవళ్ళు చూస్తుంటే
ఎంత ఆనందమో
వ్యవసాయం నాస్వాంతం
పవర్‌ కేంద్రాలు జోరుగా సాగాయి
రోజంతా కరంటువచ్చి
బోరుబావికాడ రైతు
చెరువుగట్టు మీద రైతు 
చల్లగా సాగేనుకాలం
అదునుచూసి దుక్కి దున్నంగ
అన్ని పంటలు సమృద్ధిగా పండుతాయి..
పంటలన్నీ చేతికొస్తే
నట్టింట ధాన్యలక్ష్మి దరహాసమే
 
 
- అద్దోజు సూర్యనారాయణ
సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో