పవిత్రబంధం

జగమెరిగిన బ్రాహ్మణుడికి జందెమేల? - ఇదో ప్రశ్న!
జందెం జగాన్ని అర్థం చేయిస్తుంది
అర్ధం అర్ధమైతే జీవితం అర్ధమౌతుంది
వెన్నుపూసలేని జీవితం,
వన్నెచిన్నెలులేని పూసలదారం
అనుభవాల పూసలేరుకుంటు
జ్ఞాపకాలఏరులో ఈదుకుంటూసాగితే
సాగే కాలప్రవాహిలో క్రిమిలా కొట్టుకపోదు జీవనం
జీవనం వశమై ఎక్కడికో ఊరేగదు
గాలిబుడగలు గ్యాసు బుడగలు
మాటల ఊటల బుడుగలు విబిజియారై కాంతులు చిమ్మే చిడుగులు
డ్రైనేజికాలువలోని నీటిబుడగలు
కొలనులోని తామరాకుపై బుడగలు
సబ్బుబుడగలు బోరింగ్‌పైపు నీటిబుడగలు
మేఘజలం ధరిణిమాత చల్లని ఒడిని తగిలి
చిప్పిల్లే బుడగలు!
బుడగలు బుడగలు బుడగలే బుడగలు!
అన్నింటినీ అలవోకగా సందర్శనం చేయిస్తుంది జందెం!
జందెం ఒక సర్టిఫికెటు - జందెం ఒక మహత్తు
మూడుగా, తొమ్మిదిగా వ్రేలాడే చుక్కాని
పాంచభౌతికత పేగుకి కంటివెలుగు
పంచవెన్నెల రామచిలకకు ముక్తిమార్గం
వికసిత కమలం - కుసుమిత భాస్కరం
మట్టికడవకు మోక్షమాత
అహంభావం తుంచి ఇహపరాన
పరభావన తెరతొలగించి
నాటకం నడిపే పవిత్ర సూత్రం.
......ఉమ్మెత్తల
సాహితీ కిరణం మాసపత్రిక సౌజన్యంతో



