Facebook Twitter
రక్షాబంధనం (రాఖీ )

 రక్షాబంధనం ( రాఖీ ) 

 


రక్షాబంధనమంటే  
ఒక చెల్లి...ఒక  అన్నకు కట్టే
సిల్కు తాడు కాదు 
ఒక అక్క ...ఒక తమ్ముడికి కట్టే
దారపు పోగు కాదు

నమ్మకాన్ని కోరుతూ
సోదరి కట్టే ప్రేమసూత్రం.
రక్షణనిచ్చే సోదరుడిని
ఏకష్టం తాకరాదని శాసిస్తూ    
కట్టే రక్షాసూత్రం.

తల్లిదండ్రులు లేకున్నా 
అన్నీ తానై ఉంటానంటూ
ఓ అన్న ... చెల్లికి చేసే వాగ్దానం
ఓ తమ్ముడు... అక్కకి చేసే 
కృతజ్ఞతాభివందనం.


ప్రతీ కుటుంబానికి కావాలి 
కట్టిన చేయికి కష్టం కలగనివ్వని అన్న
కట్టించుకున్న చేతికి నొప్పి తెలియనివ్వని చెల్లి
తమ్ముడి బాగోగులు చూసే అక్క 
అక్కని జీవితాంతం కంటికి రెప్పలా కాచే తమ్ముడు 
 

                                                               

... @ శ్రీ