Facebook Twitter
ఏకాంతాల ఉరులు

  ఏకాంతాల ఉరులు

 

 

           ఇప్పుడు నాకు నేను పరిచయం లేని జ్ఞాపకాన్ని
           సముద్రం మీద ఎడారిలా రగులుతున్న ఒంటరిని
           కన్నీటిని అలల్లా పొంగిస్తున్న చీకటి చితిని
            నన్ను ఎవ్వరూ ఆపకండి....
            నన్ను ఎవ్వరూ అంతం చేయకండి...

           నా ప్రయాణపు రైలు నామీదే ప్రయాణించింది
           తొలి అడుగే మడుగై ఊబిలో కుక్కేసింది
           జీవితమంత సంతోషాన్ని ఒక్క లిప్తలో తాగేసింది
           ఆనంద వాయువుల్లే అంతాన్ని శోధించుకోమంటుంది
           అందుకే నన్ను ఎవ్వరూ ఆపకండి
           నాకు నేనే అంతాన్ని...
           నాకునేనే ఆరంభాన్ని కోల్పోతున్న క్షణాన్ని...

            ప్రేమకు పిచ్చిపట్టినట్లు హృదయంలో ఘనీభవిస్తున్నాను.
            క్షోభకు, ఛలనాని మధ్య
            నిశ్చలంగా ఊపిరిని వదిలేస్తున్నాను.
           నా చిటికెనేలును ఆత్మనుండి విడదీసేశాను
            తిమిరాల కొసన గుండెను వ్రక్కలు చేసుకుంటున్నాను.
            నాకు నేను పురుడు పోసుకోలేని స్వయం ఛలితాన్ని
            దయచేసి నన్ను ఎవరూ ఆపకండి.

             గతం భూతంలా, అనుభవాలు శ్మశానంలా,
             జ్ఞాపకాలు  పిచాచాల్లా వెంటాడాయి, వేటాడాయి.
            ఇంకేం మిగిలింది... నన్ను నేను ఉరి తీసుకోడానికి
            కోల్పోయిన వనంలో చిగురించని పుష్పం నాది
            దయచేసి జాలి, దయ, ప్రేమ అనే పదాలను
           ఈ సమాజ యవనికపై సమాధి చేయండి...
              నాకులా,,, నేనులా,,, నా అనుభూతుల్లా.,..
   
           ఇప్పుడు మరోలోకం... మానవత కోల్పోని లోకం కోసం
            వెతుకులాట... వెన్నెలాట... ప్రారంభించే ఓపికలేని...
           ఆశలేమితో.... అడియాశల బడిలో ఓన మాలు

           దిద్దుకుంటూ... దిద్దాలని శ్వాసించలేని భాషకోసం...

 

- రవీందర్