రోజురోజుకీ పెంచేస్తూంటే
- శారద అశోకవర్ధన్

' సినిమాలు లేకపోతే మానె చిరుజల్లుకురిస్తే చాలు
అదే పదివేలు'
అని తొలకరి చినుకులకి ఎదురుచూస్తూ వుంటుంది .
మండుటెండని మరిపించే మల్లెపూల పరిమాళాలలో
మామిడి పండ్లలోని మాధుర్యంలో
అలసటా, ఆవేదనలు మరిచిపోయి
రేపటి ఆశలుకోసం వేయి కళ్ళతో
ఎదురు చూస్తూ వుంటుంది
ఎన్ని రేపులు మోపులు మోపులుగా
వెళ్ళిపోతూన్నా అలా వెచ్చి చూస్తూనే వుంటుంది,
నగరంలో నారీమణి
మధ్య తరగతి సుందరీమణి!
బాల్యం, యౌవ్వనం, వృద్ధాప్యం
మనిషిలో మాప్రులు తెచ్చినట్టే
వసంతం, గ్రీష్మం, హేమంతం, శిశిరం
ఋతువులు కూడా కాలంలో మార్పులు తెస్తాయి కద!
ఎండల్లో వేగిపోయి పగుళ్ళు బాసిన పుడమి తల్లిని
చల్లబరుస్తూ చినికి చినికి వానై
వానల్లా మూసురైతే
హాయిగా వుందన్న నారీమణి
బురద గుంటల్లా తయారయిన
విధులని చూసి విసుక్కుంటుంది
శ్రీవారూ పిల్లలూ తడుపు కొచ్చిన
తడి గుడ్డలను చూసి గతుక్కుమంటుంది.
ఉఱుములనీ మెరుపులనీ చూసి
' ఆకాశం చిల్లు పడలేదు కదా' అని సండేహిస్తుంది
ఇంట్లో వుంటే ఈ తిప్పలు తప్పవని
ఉద్యోగంలో ఎంతో హాయి వుందనీ
తియ్యని కలలు కంటుంది
అవసరమయితే దాని కోసం
విశ్వ ప్రయత్నం చేస్తుంది!
తీరా ఉద్యోగం ఒచ్చిందంటే
ఇంటి పనీ, ఆఫీసు పనీ చేసి
అలిసి పోతున్నానని ఆక్షేపిస్తుంది
ఎండకీ వానకీ గురైపోయి
గుండెచేత బట్టుకుని నిండు బస్సునెక్కి
ఉస్సురని ఇల్లు చేరుకునే ఇంతి
' ఇంతకంటే ఇంట్లో వుండడమే మేలు '
అనుకుంటుంది, అదే కోరుకుంటుంది.
నగరంలో నడిరోడ్డు మీద సయితం
నిర్భయంగా నడవలేని నారీమణి
గాలిని సయితం నగరంలో స్వేచ్చగా
పీల్చునోచుకోని అబలామణి
కేవలం ఊహలతోనే ఊపిరి పోసుకుంటుంది
ఊరడిల్లుతుంది!
ఉన్నదానితో రాజీపడలేక పోవడం
లేని దానికోసం ఆరాట పడడం
ఇదే జీవితమంటే
ఆశలతో బతకడమే
జీవించడం అంటే!
ఊహలే లేకపోతే
ఆశలే చచ్చిపోతే
జీవితానికి లేదు అర్ధం
జీవించడం వ్యర్ధం!



