Facebook Twitter
కన్నుల్లో నీ రూపె

కన్నుల్లో  నీ రూపె

                                                                                                -వి. బ్రహ్మనందచారి

కన్నుల్లో  నీ రూపె
గుండెల్లో నీ తలపె
నిలువెల్ల నీవుండ
నాకేమి చింతనే

ఏ రూపమున నైన
నా చెంత నువు జేరి
చింతలను  బాపవే
శాంతమదివై చేరి

పంతమా నాపైన
ఇంతైన దయరాద
ఎంత తడవని వేతు
నా....జాబిలమ్మ