చిరునవ్వులతో

చిరునవ్వుల దీపం వెలిగించు
నీ బాధల యొక్క గతిని తొలగించి
చిరునవ్వుల బాణం సంధించు
శత్రువులే ఉండరు గమనించు
మనిషన్నోడు మనసారా తానే నవ్వొచ్చు
మనసున్నోడే తనవారిని కూడా
నవ్వించవచ్చు !
పైవాడు నీ నవ్వుని చూసి దిగిరావచ్చు
నవ్వుతూ నీ కష్టాలని తీర్చవచ్చు
నీ గుండెల్లో గాయాలు ఎన్నున్నా
నవ్వే వాటికి మందు అన్నది మరవద్దు.
నీ కన్నుల్లో విషాద కన్నీరు ఎంతున్నా
నవ్వే వాటికి హద్దు అన్నది విడవొద్దు!
ఈర్ష్యగా నిన్ను చూసి ఏడిచిన వారు
నిబ్బరపోయేట్టుగా
నీ చిరునవ్వుని నిచ్చెనగా చేసుకుని
ఎక్కర ఒక్కొక్క మెట్టు !
కోపాన్ని నవ్వు కరిగిస్తుందని
రూపాన్ని నవ్వు వెలిగిస్తుందని
పదిమందికి నువ్వే చాటింపు చేయ్!
ఏడ్చేవాళ్ళుంటే కసితీరా
ఎడ్పిస్తుందీ లోకం
నవ్వే వాలుంటే కడుపారా
ఏడుస్తుంది కాలం !
కనుక లోకాన్ని ఎదిరించే మార్గం
నీ చిరునవ్వు!
కదిలే కాలాన్నీ ఎదురీదేటి ధైర్యం
నీ చిరునవ్వు !
ఇది జీవిత సత్యమని గుర్తించుకుని
ఆనందం నీవై జీవించు!
నీ చలనం నీవే గమనించుకుని
సంచలనం నువ్వే సృష్టించు!
రచన - శాగంటి శ్రీకృష్ణ
krishna.6643@gmail.com



