Facebook Twitter
పరితాపం- అపర్ణా ఫణికూమార్

పరితాపం

 

అపర్ణా ఫణికుమార్

 

kavithalu, paritapam, aparna phanikumar

 

ప్రియతమా!

వెండికొండల అంచున మధురోహల తోలివెన్నెల కురిసేవేళ

శిధిలమైన కోవెలలా ఉన్న నామనసు పొరల్లో

పారిజాతపు పరిమళంలా అలుముకున్నది నీరూపు ,

పరితాపం నా మనోహర్ ఆలోచనా విహంగాల గమ్యం నీవేనని,

నా మదిలో ఎగిసిపడుతున్న భావాలకు ఆకృతి నీవేనని నీకు తెలుసా!

 

నీకనురెప్పల నీడలో...

నీకనుపాపల ఊయలలో

నిశ్చింతగా, నిర్భితగా

నిదురించాలానే నాకోరికను కాదనుకుమా ...

 

నా ఎదలోతుల నుంచి పొంగిపోరలుతున్న

ఈ మాటలకందని భావాలను అక్షరకృతినిచ్చి

నీ మనసులోని అనురాగాన్ని నీకు అర్పించాలని

ఎంతో ఆశపడుతున్నా,నీ తలపులతో తపిస్తున్నా

 

నీ మాటే నాకు వేదం, నీవే నా ప్రాణం

నీ ప్రేమ లేకుంటే నా మనుగడే అగమ్యగోచరం.