Facebook Twitter
మౌనం (కవిత)

మౌనం

 

గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న ఆలోచనల

అవశేషాలేవో గట్టిగా కలిచివేస్తూ ఉంటాయి

జాలిలాంటిదేదో పుట్టుకొచ్చి మలినాల్ని

ద్రవీకరించాలని అనుకుంటూ ఉంటుంది

నిశ్శబ్దానికి బానిసైపోయిన ఆ ద్రవం

కళ్ళ నిండా చీల్చుకొస్తున్నపుడు మౌనాన్ని

బద్దలుకొట్టాలనుకున్నా కొన్నిసార్లెందుకో

గొంతు పెగలదు.. మనసుకు కూడా మెదడుంటుందా? ఏమో మరి!

ఉంటే దానికేమౌతుందో! అది కూడా
అపుడపుడేమి మాట్లాడదు.

నిశ్శబ్దంలో ఎంతో నేర్పించిన మౌనం

గుండెలు బద్ధలవుతున్నా ఎందుకో మరి

కొన్నిసార్లు మెుండిదవుతుంటుంది

మౌనం ఎంత గొప్పదో

అపుడపుడంత చెడ్డది

 

-సరిత భూపతి