Facebook Twitter
అంతర్ముఖం (కవిత)

 

అంతర్ముఖం



స్వరంలేని మెదడొకటి జీవితాన్ని చదువుతూ ఉంటుంది
అది అంతఃఛక్షువు వింటూ ఉంటుంది
శరీరం మెుత్తం వైకల్యమే చూడు
కానీ గొంతు లేకున్నా మెదడు చెప్పగలదు
కళ్ళు లేకున్నా హృదయం చూడగలదు
మరి శరీరాన్ని,జీవితాన్ని నియంత్రించేవి ఇవి రెండేగా..

జీవితంలో నాకింకేమీ లేదనుకున్నపుడు కూడా
ఆలోచన ఎప్పుడూ వెంటే ఉంటుంది
వైకల్యం అవయవాలకేమో
ఆలోచనకు కాదుగా
నీ ప్రతిబింబం ఎక్కడో కాదు నీ మనసులోనే ఉంది
నిన్ను నీలో వెతకటం మానేసి
అరకు లోయల్లో,ఆల్ఫ్ పర్వతాల్లో వెతుక్కుంటావేం?

- సరిత భూపతి