నువ్వు మారిపోయావ్ (కవిత)
నువ్వు మారిపోయావ్

ఆ వెన్నెల్లో ఒకరి నవ్వుల్లో ఒకరం ఇంకిపోవటం..
నిశీధి అంచుల్లో నడుస్తూ చెప్పలేక చెప్పుకున్న వీడ్కోళ్ళేవీ నీకు గుర్తుండి ఉండవు..
చిన్న స్పర్శలోనే మౌనాన్ని కూడా మనసుతో చదివిన నువ్వు
ఇపుడు కళ్ళడిగే ప్రశ్నలను గుర్తించలేవు
ధారాళంగా కురిసి ఎండిపోయిన మనసును తడుపుతూ ఆత్మీయంగా ఇంత వ్యధయేమని కూడా అడగలేవు
సాగరమంత శూన్యంలో నిన్ను వెతికి పట్టుకున్నపుడు కొట్టుకుపోయినా వదిలిపోలేని నీటిబొట్టునే
మాటల తూటాలు చీల్చివేస్తున్నా బంధమనే ఆయుధమెపుడూ మనసుకు కుట్లేస్తూనే ఉంటుంది అది జీవితాన్నే పెకిలించివేసినపుడు నెత్తురోడిన గుండెల్లో మిగిలేది శూన్యం కాక మరేమిటి?
.jpg)
----- సరిత భూపతి



