ఆ నవ్వులు నన్ను చంపేస్తున్నాయి...!!

నీకు గుర్తుందా నా పుట్టిన రోజు ఎప్పుడని
నీకు గుర్తుందా నీ కోసమే మీ ఊరికి వచ్చేదానినని
బయటి వాళ్ళ పుట్టిన రోజు గుర్తుపెట్టుకోని మరి విష్ చేస్తావ్
నన్ను మాత్రం పరాయిదానిలా చూస్తావ్.....
అవునులే గుర్తుపెట్టుకోవడానికి ఇపుడు నేను నీకేమి కానుగా
కొత్త స్నేహితులు, కొత్త పరిచయాలు కలిశారుగా
ఇక నేనెక్కడ నీకు గుర్తోస్తాను కదా....
నీకు తెలుసా నీతో ఎందుకు గొడవ పడతానని
కనీసం గొడవ పడుతూ అయినా కాసేపు నాతో మాట్లాడతవని
నీకు తెలుసా నా పుట్టిన రోజుకి నీ కాల్ కోసం ఎంత ఎదురు చూశానని
అపుడైనా నాతో ప్రేమగా మాట్లాడతవని.....
నా మీద కోపముంటే కొట్టు భరిస్తాను
నన్ను తిట్టాలనిపిస్తే తిట్టు తట్టుకుంటాను
కానీ ఇలా నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నన్ను మోసంచేయకు
ఎందుకంటే నీతో ఉన్నవాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు
నువ్వు చేసిన గాయం కంటే.....
ఆ నవ్వులు నన్ను మానసికంగా చంపేస్తున్నాయి...!!
Courtesy..




