ఎదురుచూపు (కవిత)
ఎదురుచూపు

అటుగా వెళ్తున్న నీవు ఒక సారైన నా వైపు తొంగి చూస్తావని.....
వెన్నెల కాంతి లొ నీ ప్రతిబింబాన్ని నీటిలొ నైనా నే చూడగలనని.....
రేయి అంతా పెరటిబావి చెట్టు క్రింద కూర్చొని నీలి ఆకాశం లో ఉన్న రేరాజు ని చూస్తూ ఉండిపొయా!
అంతా నన్నే చూస్తున్నారు...
హేళనగా నవ్వుతున్నారు....
మాటల కత్తులు విసురుతూనే ఉన్నారు.....
కాని నా మది ఈ ప్రపంచపు కట్టు బాట్ల బరి దాటి అనంత విశ్వపు స్వేచ్చా విహంగమై అలౌకిక అమలిన ముకుళితనై నీ బాహు పరిష్వంగమై మురిసిపొతున్నానని వారికేం తెలుసు...
ఆరాధించడం మాత్రమే తెలిసిన పిచ్చి ప్రేమికనని .....
అనురాగాన్ని మాత్రమే నింపుకున్న నీ ఆరో ప్రాణాన్నని.......వారికేం తెలుసు!
......Poetry Sudha Challa



