Facebook Twitter
'ఆమె' - బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి

'ఆమె'


- బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి

 

కలల పాదాల్లో

అనుమానం గుచ్చుకుంటుంది

కనుల నదుల్లో

కల్వరవనం విచ్చుకుంటుంది.

 

తలుపు తడుతూండగనే

బతుకు తెల్లవారింది!

గొంతు విడుతూండగనే

పాట ముగబోయింది.!!

 

ఎన్ని ప్రమాదాలో దాటివొస్తావు

ఎదను నింపుకుని

ఎన్ని అనుభూతులో మోసుకొస్తావు

హృదిని వొంపుకుని!

 

ఆమె రాక ముందు

ఎన్నెన్నో ఊహలు

ఆమె వొచ్చాక.....

అనంత మౌనం!

 

మేమిద్దరం

అడం అవ్వల్లం-

గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో

ఆపిల్ పళ్ళతో ఆడుకుంటాం!

 

సశేషం