శ్రీ శోభకృత్!
శ్రీ శోభకృత్!

శ్రీ శోభకృత్ సుస్వాగతం
కృష్ణపక్షపు రాత్రిలో
సుధాకరుడు తరిగినటు
క్రమంగా బుద్ధిని హరించక
శుక్లపక్షపు రజనిలో
వెన్నెల అతిశయించినటు
మనోవికాసం విస్తరిస్తూ
మధుమాసపు తరులతీరు
విరబూసే విరులతీరు
శ్రావ్యపు కూతల కోకిలలతీరు
ప్రాభాత మయూఖాల వెల్గులతీరు
ప్రాణకోటి మనుగడుండేనని
చైత్రపు విరుల నెత్తావులల్లే
మలయమారుతపు మంచిగంధమల్లే
శుభఘడియల్ని చుట్టూ చుట్టుకుని
జగత్తుకు వరప్రదాతవయ్యేవని
వినమ్రంగా నమస్కరించి ప్రార్థిస్తూ
ఆహ్వానమమ్మా ఆహ్వానం
శ్రీ శోభకృత్!! శ్రీ శోభకృత్!!
-- రవి కిషొర్ పెంట్రాల



