Facebook Twitter
కులం!

కులం!

స్వదేశములో విదేశాలలో 
వాట్సాపులో ఫేసుబుక్కులో 
ఇన్స్టాగ్రాములో ట్విట్టర్లో 
ప్రపంచమంతా విస్తరిస్తూ

విద్వేషం చిందిస్తూ కులం!
సమాజాన్ని చీలుస్తూ కులం!
కులం! కులం! కులం! కులం!
కులం! కులం! కులం! కులం!

బడి ఒడిలో 
కళాశాలలో
విశ్వవిద్యాలయంలో 
బ్రతుకుబడిలో 

కులంతోనే చోటిస్తూ
కులంతోనే వేర్జేస్తూ 
కులం! కులం! కులం! కులం!
కులం! కులం! కులం! కులం!

రాజకీయాల్లో 
చలనచిత్రాల్లో 
వ్యాపారాల్లో 
కీలకపదవుల్లో 

మీవాళ్ళే అంతానంటూ 
దోచుకుతినేస్తున్నారు మమ్మల్నంటూ 
కులం! కులం! కులం! కులం!
కులం! కులం! కులం! కులం!

నాయ'కుల' ఎన్నికలలో 
అధికారుల పదోన్నతులలో
దేవుడిధర్మకర్తల నియామకాలలో 
మనిషిశ్వాసవీచే ప్రతిచోటా 

కులం శ్వాస పీలుస్తూ
కులం వంట భుజిస్తూ
కులప్రవాహంలో 
కొట్టుకుంటూ కొట్టుకుపోతూ
మనిషితనాన్నీ మానవత్వాన్నీ ఖూనీ చేస్తూ
కులం! కులం! కులం! కులం!
కులం! కులం! కులం! కులం!

--- రవి కిషోర్ పెంట్రాల, లండన్!