ఆదివారపు అవసరాలు
ఆదివారపు అవసరాలు

బద్ధకపు ఉదయపు మబ్బు నుండి
పరుగెత్తే మేఘం లాంటి మరో ఉదయం
వరకూ ఓ ఖాళీ..
ఆశలు ఆశయాలకు సెలవు..
తీరిక వేళ అంటారు కొందరు..
వీకెండు అని అంటారు మరికొందరు..
మత్తుగా నిదురోతున్న గమ్మత్తైన దేహం .
ఇరుగుపొరుగు వారింట్లో నాన్ వెజ్ వంటల గుమగుమలు..
కాసేపు విరామం..
కాసేపు ఏదో తీరికలేని పని..
కాసేపు టీవీలో కాలక్షేపం..
మరికాసేపు సోషల్ మాధ్యమంలో బిజీ..
అవసరం లేని పనుల్లో
అవసరం చేసుకొని మరీ బిజీ
అయ్యే ఆపద్భాందవులు ఎంతో మంది..
ఖాళీగా ఉండటం..
తినాలనుకున్నది తినాలనుకోవడం..
మనం మాట్లాడాలనుకున్నవాళ్ళతో మాత్రమే మాట్లాడటం..
ఇవన్నీ ఆదివారపు అవసరాలే..
✍🏻.దాసరి మల్లేశ్



