Facebook Twitter
'ఆమె' - బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి

'ఆమె'


- బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి

 

ఆమె హృదయం పొయ్యి మీద

పాలు పొంగుతాయి

నేను పెదాల పంచదారను కలుపుతాను

కనుల కప్పుల్లోంచి తేనీరు సేవిస్తాము

 

గడియారం ఊయెలలోఆమె!

స్వరం లోయలలో నేను!

ఇరువురం కలిసి

స్వర్గద్వారాల్ని బార్గా తెరిచేస్తాము!

 

ఆమె వసంతమై వొస్తుంది

సంధ్యా వర్ణర్ణ్వాన్ని ధరించి

కవితాసుమాలనల్లి

కంఠాహారంగా అర్పిస్తాను!

 

ప్రేమాన్వేషణలో

అనంత పధచారి ఆమె!

అత్మాన్వేషణలో

అనంత సంచారిని నేను!!

 

'పూజ' అంటే తెలిసేది కాదు....

ఇప్పుడు నేను చెప్పగలను-

ఆమె పాదపీఠం మీద ఫాలాన్ని ఆన్చి

కన్నీటి పుష్పాలను అర్పించడం!

 

సశేషం