Facebook Twitter
'ఆమె' - బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి

'ఆమె'


- బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి

 

కలలోని కలలో

అలల పాదాలతో తేలివొస్తావు

కన్నీటి కడిలి నావలా

కరిగి మాయమోతావు!

 

వొచ్చే పాదాలు

వెళ్ళిపోయే ప్రేమలూ...

హృదయం

నిరీక్షణా స్మశానమైంది.

 

తాళ్ళూ జైలళ్ళూ అఖ్ఖర్లేదు

నన్ను బంధించేందుకు

నీ కన్నీళ్ళ ముంచి విసిరిన ఒక్క చూపు చాలదా

నేను శాశ్వతంగా బందీనయ్యేందుకు!!

 

నేను నడిచిన రోడ్లన్నీ

నన్ను చూసి నవుతున్నాయి...

రోజూ చేసే

ఈ తీర్ధయాత్రలకూ అర్ధం ఏమిటీ అని!

 

ఆమె మీద మీద

మోహనరాగాన్ని మీటుతున్నపుడు

నాకుతెలిసింది

నేనే సరస్వతినని!!

 

సశేషం