నిర్మలమైన భక్తి

మధురకు దూరాన అడవిలో ఒక గురుకులం ఉండేది, దానికి శ్రీకృష్ణుని భక్తుడైన ‘హరిదామ్యుడు’ అనే గురువు ఉండేవారు. ఆయన తన శిష్యులతో కలసి యాత్రలకు వెళ్ళొస్తుండేవాడు. అలా ఒక రోజు తిరుగు ప్రయాణంలో ఉండగా సాయంత్రం వేళ పెద్దవర్షం ఎడతెరపి లేకుండా కురియడం వలన వర్షం ధాటికి నీళ్లు ముంచెత్తడంతో మార్గంలోని పల్లెల్లో దారులన్నీ నీటితో నిండి నిర్మానుష్యమయ్యాయి.

Dec 30, 2024

కలిసి వస్తే కుట్టు సూది చాలు!

వెనక కోసల దేశంలో ముగ్గురు మిత్రులు ఉండేవారు. వారిలో ఇద్దరు నందుడు, సునందుడు అనేవారు ధనికులు. మూడో వాడు ఆనందుడు గర్భదరిద్రుడు. అతను తాళ్ళు పేనుకొని జీవించేవాడు. అతణ్ణి ఏ విధంగానైనా ధనికుణ్ణి చెయ్యాలని నందుడూ, సునందుడూ ఆలోచన చేశారు.

Dec 27, 2024

చేసిన సాయం ఊరికే పోదు

కారు ఆగిపోయింది . అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి . దిగి చూసింది టైర్ పంక్చర్ అయ్యింది . స్టేఫినీ ఉందికానీ తనకు వెయ్యడం రాదు . రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది . ఒక్కరూ ఆగడం లేదు . సమయం చూస్తే సాయంత్రం ఆరు దాటుతోంది.

Dec 26, 2024

తృప్తి

ఒక సాధువు ఊళ్లు తిరుగుతూ, ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు.* అక్కడి వీధులలో నడుస్తూ ఉంటే, నేలపై పడి ఉన్న ఒక నాణెం ఒకటి అతడి కంట పడింది. అతడు వంగి, తన చేతుల్లోకి తీసుకున్నాడు. కానీ, ఆ నాణెం వల్ల అతడికేం ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోవడం కాదు, అసలు అవసరం లేదు.

Dec 24, 2024

నాకు ఇష్టమైన కథకుడు ఆశారాజు

కవులు కథలురాస్తే బాగుంటుంది. అందులో కవిత్వం ఉంటుంది. కథల్లో కవిత్వం నాకు బలే ఇష్టం. శ్రీశ్రీ, తిలక్, ఇంద్రగంటి, సోమసుందర్, ఆరుద్ర...కథలను ఎన్నిసార్లు చదివానో! కవి ఆశారాజుకథలను కూడా అలాగే వెదకి వెదకి చదివాను. తొలిరోజుల్లో ఆశారాజు వీనస్, వెన్నెలతో నా కన్నులు కడిగావు, పారేసిన బతుకులు...అని ఓ ఇరవై కథలు వ్రాసినట్టు గుర్తు. అయితే అవి కథలుకావు, కవిత్వమే! ఆ కథల్లో ‘పారేసిన బతుకులు’ నాకు చాలా ఇష్టమైనకథ. ఆ కథతోపాటు ఆశారాజు కూడా నాకిష్టమైనవ్యక్తే!

Dec 3, 2024

చూడుచూడు నీడలు! ‘కథ’ నవీన్ జాడలు!

ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః ప్రారభ్య విఘ్న నిహతా విరమంతి మధ్యాః విఘ్నైః ముహుర్ముహరపి ప్రతిహన్య మానాః ప్రారబ్ధం ఉత్తమ జనాః న పరిత్యజంతి ఈ శ్లోకానికి అర్థం...ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు, ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెరువక, తుదికంటా లక్ష్యంకోసం శ్రమించడమే కార్యసాధకుడి నైజం. అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని, ఏ పనీ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలుపెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే పనిని వదిలివేసేవారు మధ్యములు అని.

Nov 30, 2024

సా హితాన అంగరంగ అభినివేశం... అంగలకుదిటి

సలలిత సుధారస సారం అన్నట్లు ఇచ్చుటలోని అనంతమైన హాయిని అనుభవింపగల్గిన రసజ్ఞమైన మూర్తిమత్వం! సాహిత్యాన్ని...

Nov 23, 2024

వీడుకోలు

జీవితం అర్థం కావాలంటే...చదవాలి. చూడాలి. పాడాలి. ఆడాలి. కిందపడాలి. పడితేనే లేస్తారు. ఆ ప్రయత్నంలోనే...ఒకరినొకరం ప్రేమించుకున్న నేనూ, ప్రమీలా లేచిపోవాలనుకున్నాం.

Nov 21, 2024

డ్రామా ఈజీ! కామెడీ కష్టం!!

ఉషాకిరణ్ మూవీస్ మంచికథకోసం వెదుకులాడింది. సినిమాకు అనుగుణంగా చతుర మాస పత్రికలో ఏదేని నవల వచ్చి ఉంటే...సూచించమన్నది. అయ్యవారు అడిగితే సంపాదకవర్గం ఊరుకుంటుందా? కిందా మీదా పడింది. నవలలన్నీ ఒకటికి రెండుసార్లు చదివింది. ఆఖరికి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మిగారి నవల ‘ప్రేమలేఖ’ను సూచించింది.

Nov 9, 2024

గొప్ప విలువలకు పట్టంగట్టిన కారా మాస్టారు

కథా రచనలోనూ, నిజజీవితంలోనూ కాళీపట్నం రామా రావు మాస్టారికి గొప్ప విలువలు ఉన్నాయి. వాటిని ప్రతి వ్యక్తి అలవర్చు కోవాలి. శ్రీకాకుళం సాహితి, సాహితీ స్రవంతి సంస్థలు ఆదివారం స్థానిక బాపూజీ కళామందిర్ లో ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కాళీపట్నం రామారావు శత జయంతి కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహించాయి.

Nov 4, 2024

మర్రిచెట్టు

ఒక నది ఒడ్డున ఒక మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు చాలా కొమ్మలతో విస్తరించి ఉండేది. కాని దానికి గర్వం ఎక్కువ నేనే అందరికన్నాగొప్ప అని అనుకుంటూ ఉండేది. ఒక రోజు నదిలో ఉన్న చిన్న మొక్కలతో మాట్లాడుతూ మీరు నాకు రోజు తలొంచి నమస్కారం చేయాలి, ఎందుకంటే మీరు నాకన్న బలహీనమైన వారు అంటుంది. అందుకు ఆ చిన్న మొక్కలు మేము నీకన్నా చిన్నవారమే కాని ఎవరి గొప్పదనము వారికి ఉంటుంది.

Oct 30, 2024

పొగడపూల పరిమళమే.. విమల వగరు జ్ఞాపకాల నవ్వు

కల్లోలిత ప్రాంతాలను కవిత్వంగా మార్చగలదు. విరిగిపోయిన కలలకు కట్టు కట్టగలదు. నిరాశల నీడల మీద నీలిపూల వాన కురిపించగలదు.

Oct 21, 2024

అవిటితనం శరీరానికే కానీ మనసుకు కాదు!

శాతవాహన ఎక్స్ ప్రెస్ స్టేషన్లో వచ్చి ఆగింది. ఖమ్మంలో అది ఎక్కువసేపు ఆగదు. వేగంగా కదిలి ఆఖరి బోగి ఎక్కింది చిత్ర. ఇంటర్మీడియట్ స్పాట్ కి అందుకోవాలంటే, ఆ ట్రైన్ లో వెళితేనే టైంకి స్పాట్ సెంటరుకి చేరు కోగలదు. ఆ బోగి లో కూడా సీట్స్ ఏమి ఖాళీగా లేవు. ఇంత లో ఎవరో మాడం అని పిలిచినట్లు వినిపించింది.

Oct 19, 2024

అంబరీషుడు.. సుదేవుడు!

ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజుల్లో అంబరీషుడు పరమ భాగవతోత్తముడు. విష్ణుభక్తుల్లో అగ్రగణ్యుడు. అంబరీషుడు ఎన్నో యజ్ఞయాగాదులు చేశాడు. దానధర్మాలు చేశాడు. ప్రజలకు ఏ లోటు లేకుండా, రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. ఆయువు తీరిన తర్వాత అంబరీషుడు స్వర్గానికి చేరుకున్నాడు.

Oct 18, 2024

చేత అన్నం ముద్ద

అమ్మానాన్న, అయిదుగురం అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ళు వెరసి తొమ్మిదిమంది కుటుంబసభ్యులం. నాన్నొక్కరే సంపాదనాపరుడు. వారికి నలభైరూపాయలే జీతం. ఆ జీతం నెల మొదటివారానికే మాకు సరిపోయేది. తర్వాత? అమ్మ అప్పు చేసేది. రెండురూపాయలూ, మూడురూపాయలు అప్పుచేసి, నూకలు కొని, వండి వార్చేది.

Oct 10, 2024

కొన్ని కథలు: మరిన్ని జ్ఞాపకాలు

చిన్నప్ప లేచిందంటే...తెల్లారినట్టే! తెల్లారినదగ్గరనుంచీ ఒకటే దండకం. శివయ్యతో పేచీ పడుతూనే ఉంటుందామె. తొందరగా నిర్మాల్యాన్ని తొలగించమంటాడు శివయ్య. అభిషేకం చెయ్యమంటాడు. చిన్నప్ప వినదు. ఆగంటుంది. దంతధావనం చెయ్యలేదంటుంది.

Oct 5, 2024

మెరుపు కవిత్వం

చేయి బలంగా విసిరి మెరుపుని గుప్పెట పట్టడం కవిత్వం

Oct 2, 2024

అప్రశిఖ

ధారా నగరం లో మాధవుడు,నందుడు అనే ఇద్దరు మిత్రులు వుండేవారు. వారిద్దరూ దూరంగా వుండే గురుకులం లో విద్య అభ్యసించదానికి వెళ్ళారు. వారిలో మాధవుడు అత్యంత మేధావి. నందుడు కాస్త మందుడు.

Oct 1, 2024

నీటిచుక్క

రెండేళ్లయింది. రాజ్యంలో వర్షాల్లేవు. నీరే తల్లి, నీరే తండ్రి, నీరే తిండి, నీరే జీవితం అయినప్పుడు, జీవితం లేదంటే...రాజ్యంలో ఎవరు ఉంటారు? ఉండరు కదా! అందుకే పక్షులూ, పశువులూ వలసపోయాయి. ప్రజలుకూడా చాలామంది వలసపోయారు.

Sep 23, 2024

మృత్యువు- ప్రేమ

మృత్యువుకు ప్రతి ఒక్కరూ భయపడతారు కానీ జనన మరణాలు సృష్టి నియమాలు. విశ్వం యొక్క సమతుల్యతకు ఇది చాలా అవసరం. లేకపోతే, మానవులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తారు.

Sep 18, 2024