Facebook Twitter
మెరుపు కవిత్వం

చేయి బలంగా విసిరి
మెరుపుని గుప్పెట పట్టడం
కవిత్వం

శూన్యంలోకి ఎగిరి
నక్షత్రమాలని లాగి ధరించడం
కవిత్వం

కాళ్లు నేలన బలంగా పాతుకుని
ఎడం చేత్తో నింగిని
చర్రున కిందికి వంచడం
కవిత్వం

ప్రియుడికి అధరామృతాన్నిచ్చీ
బిడ్డకీ అమృతమయ పాలధారల్ని
మిగల్చటం 
కవిత్వం

కవి చేవ్రాలు కవిత్వం

-పెమ్మరాజు గోపాలకృష్ణ