మనం ఐశ్వర్యం అంటే అనేక రకాలుగా ఊహించుకుంటాం. కాని అసలు ఐశ్వర్యం అంటే ఏమిటో తెలుసుకుందాం
ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు, లాకర్స్ లోని తులాల బంగారాలు కాదు?!?!?!
ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జెల చప్పుడు ఐశ్వర్యం
ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం
ఎంత ఎదిగినా, నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం
అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం
భార్య చూసే ఓర చూపు ఐశ్వర్యం
పచ్చటి చెట్టు, పంటపొలాలు ఐశ్వర్యం
వెచ్చటి సూర్యుడు ఐశ్వర్యం
పౌర్ణమి నాడు జాబిల్లి ఐశ్వర్యం
మనచుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం
పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు ఐశ్వర్యం
ప్రకృతి అందం ఐశ్వర్యం
పెదాలు పండించే నవ్వు ఐశ్వర్యం
అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు ఐశ్వర్యం
బుద్ధికలిగిన బిడ్డలు ఐశ్వర్యం
బిడ్డలకొచ్చే చదువు ఐశ్వర్యం
భగవంతుడిచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం
చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి ఐశ్వర్యం
పరులకు సాయంచేసే మనసు మన ఐశ్వర్యం
ఐశ్వర్యం అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు.
కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం.
మనసు పొందే సంతోషం ఐశ్వర్యం.
ఇన్ని ఐశ్వర్యాలు ఉంటేయి ఇవి వదిలేసి ప్రశాంతత లేకుండా జీవనం గడుపుతున్న మనమందరం ఐశ్వర్యాన్ని కోల్పోయిన వాళ్ళమౌతాము
సేకరణ
M.s.s.k
