Facebook Twitter
పూట పూట నీ పందిరిలోన సందడి

పూట పూట నీ పందిరిలోన సందడి

 

 

ఊరూ వాడా అందరూ ఎదురుచూసేనంట
ఊరూరా తిరిగి "మా మంచి గణపయ్య"
మా ఇంట కొలువుదీరంగ ఈనాటి "మట్టి గణపతి "
ఇలలో వారందరూ జోరు జోరుగా మంగళ హారతులిస్తూ
ప్రతీ ఏటా "వినాయక చవితి " పండుగకు ఆనందం కురిసే వేళ !!

అందరి విఘ్నములను తొలగించి మంచి శుభములను
కురిపించవయ్యా ఓ సిద్ధి బుద్ధులని ప్రసాదించే మావిఘ్నరాజా !!
బొజ్జ నిండా నీకు కుడుములను , పాయసంబులు పోసేము
నీ ముఖమెత్తి ఒక్కసారైనా చూసి మము దీవించవయ్యా !!


పల్లవమ్ములు కట్టెదము , పూలు , పండ్లతో ,పాలు తేనెలు , పంచభక్షములు , ఫలహారములు తోడ
నీకు నైవేద్యములు పెట్టెదమయ్యా వినాయకా
మూషిక వాహనము మీద వేగంగా వచ్చి   దర్శనమీయవయ్యా!!

నీ లడ్డూ ప్రసాదమును వేలం పాటలో ఆనందముగా
చేజిక్కిచ్చుకునేందుకు  ఆట పాటల తో
పిల్లా , పాపలు సందడి జేసెదము
నీ కథలే మాకయ్యెను ఆదర్శం !!

తల్లి దండ్రులను ప్రణమిల్లగా
ముమ్మారు ప్రదక్షిణము జేసిన చాలు
సకలదేవతలను దర్శించిన భాగ్యమును నీవు తెలుపగా
అందరమూ ఆచరించేమయ్యా  ఓ గౌరీ తనయా !!

పార్వతీ పరమేశ్వరుల ముద్దు బిడ్డవే మా అందరికీ
అండ దండగా నీ ఆశిస్సులతోడ చే "గణేశ ఉత్సవాలు "
ఉత్సాహముగా జరుపుకుండెదమయ్యా
పూట పూట నీ పందిరి లోన సందడి కి మేమంతా
చెప్పేదము "గణేష్ మహరాజ్ కీ జై "
జై గణేశ పాహిమాం, జై గణేశ రక్షమాం
జై జై వినాయక ,శరణు శరణు గణేశ !!

-  దివ్య చేవూరి