చెప్పుడు మాటలు
చెప్పుడు మాటలు
కలతలకే పెద్ద తల
కల్పనకే కల ఈ చెప్పుడు మాట
చప్పుడు కాకుండా ఉండే మాట
చలించని మనసును ఉగ్వేదాలకు దారితీసే మాట
చక చక పరుగులు తీసే మాట
చిన్నా పెద్దల నోట వినే మాట ప్రతీ పూట "చెప్పుడు మాటలు విన్నావో అంతే సంగతి "
తర తరాలను దూరం చేసేను ఓ చెప్పుడు మాట
స్నేహాలను శత్రుత్వాలుగా మార్చేను ఈ "చెప్పుడు మాట "
తల్లి దండ్రులు , గురువులు చెప్పిన మాట లు ఎప్పటికీ సత్యం
కల్లమాటలు జోలు మాని "మంచిని చెప్పే మాటలు " ఆచరించిన
దైవము నిను మెచ్చంగా !!
సమాజమునకు "పెద్దల మాట చద్ది మూట " యే గానీ "చెప్పుడు మాటలు"
కానే కాదురా !!
ఇకనైనా ఎల్లరు చప్పుడు చేయక చెప్పుడు మాటలు జోలు పోకండి !!
- దివ్య చేవూరి
