Facebook Twitter
వరలక్ష్మీ తల్లీ రావమ్మా 

వరలక్ష్మీ తల్లీ రావమ్మా 

 

 

వరలక్ష్మీ తల్లీ రావమ్మా 

వరమిచ్చే వరలక్ష్మీ రావమ్మ 

పసుపు , కుంకుమ 

పూల పళ్ళెము తోడ ముత్తైదవులంతా 

స్వాగతమిత్తుము శ్రావణ శుక్రవార 

వరలక్ష్మీ తల్లీ రావమా !!

 

సౌభాగ్యములు మాకిచ్చే జననీ 

నీ రాకాతో మే తరించూ వేళ 

మామిడి తోరణాల , ముత్యాలముగ్గుతో 

రాశిగా పూలతో పూజించుమమ్మా 

పసుపు కుంకుమ అక్షింతల తోడ 

కొలిచేము తల్లీ ..

 

తోరములు కట్టీ , రూపునూ పూజించి 

గృహమున వనితలకు వాయనాలు ఇచ్చుచూ 

వరముల వరలక్ష్మీ నిన్ను మేము స్మరింతుము 

 

కళకళ లాడే గృహమున 

నీవే మా కల్పవల్లీ తల్లీ 

నీవమ్మా .. నీ కరుణా , ప్రేమను 

మా పై కురిపించువమ్మా 

ఇలలో నీకే అందరమూ వేచీయున్నాము తల్లీ !!

వరలక్ష్మీ తల్లీ రావమ్మా !!

 

నీ పూజా వ్రతమూ చేసే 

భాగ్యము , వరమును ఇవ్వమ్మా 

తల్లీ పిల్లా పాపల తోడ హారతి 

నీ కిచ్చేము మనసా మా తల్లీ 

వరలక్ష్మీ రావమ్మా !!

 

సకల లోక జనులను రక్షించే 

తల్లీ నీ దయా కృప లతో మమ్ము ఎల్లవేళలా 

కాపాడు వరలక్ష్మీ తల్లీ ..

వరములిచ్చే వరలక్ష్మీ రావమ్మా 

భూలోక వనితలా నోము పండించమ్మా 

వరమివ్వు తల్లీ వరలక్ష్మీ తల్లీ రావమ్మా !!


- దివ్య చేవూరి