Facebook Twitter
అమ్మ ప్రేమ

అమ్మ ప్రేమ

 

 

అమ్మ
ఆ పిలుపు మధురం,
ఆ ప్రేమ స్వచ్ఛం..
కన్నవారు, కట్టుకున్నవాడే ప్రపంచంగా బ్రతికే స్త్రీ
ఎప్పుడైతే బిడ్డకు జన్మనిచ్చి అమ్మ అవుతుందో అప్పటినుండి తనకి ఆ బిడ్డే ప్రపంచం..
పురిటినొప్పుల్ని తన బిడ్డ మొదటి స్వరం, మొదటి స్పర్శతో మర్చిపోయి,
నా సర్వస్వం అని సంతోషిస్తుంది..
కంటికిరెప్పలా చూసుకుంటూ అమ్మ అనే మొదటి పిలుపు కోసం ఆరాటపడుతుంది..
తన చివరి శ్వాస వరకు బిడ్డ గురించే ఆలోచిస్తుంది..
అమ్మ ప్రతి ఆలోచన, ప్రతిఆనందం, ప్రతి ఆశ, ప్రతి అడుగు బిడ్డే..
అందుకే అమ్మ ప్రేమ స్వచ్ఛం.. అమ్మ ప్రేమ అనంతం..
కనిపించని దేవుడికంటే గొప్పదైన అమ్మ కోసం గుడులు కట్టాలని లేదు..
అమ్మని అమ్మలా చూసుకుంటూ, అమ్మ చూపించే ప్రేమలో పదోవంతు ప్రేమ చూపించినా చాలు
అమ్మ ఆనందంగా ఉంటుంది..
ఈ సృష్టిలో, అమ్మని ఆనందంగా ఉంచటం కంటే గొప్ప అనుభూతి ఏముంటుంది...
ఉంచుదాం.. అమ్మని ఆనందంగా ఉంచుదాం.