Facebook Twitter
నాలో భావం ఉసులాడినపుడు మది పలికిన భాష

నాలో భావం ఉసులాడినపుడు మది పలికిన భాష


అమ్మ:  ఊయల నందు...
            ఊసులాడిన పాప...
            ఊ కొట్టినా ఆమ్మ...
            ఊహించే భాష నా తెలుగుభాష !!

నాన్న:  చెరుకుగడలోని పాకంబును
            చేర్చి నా ఆకలిని తీసి 
            చేరువనే నన్నుకాంచే
            చేతన నిచ్చే నా తండ్రిభాష తెలుగుభాష

ప్రేమ:   నామది భావ సంద్రమా...
             నే మధుర లిఖితంగా          
             నా వాచకం కమనీయంగా...
             నీ మలచగల మదివర్ణం నా తెలుగుభాష

ఆదరణ: చినుకుపడితే చిన్నహృదయాలు
              చిందులేస్తూ చిలిపిగా ఆడేఆటల్లో
              చిగురించే క్రొత్త జీవనానికి...
              చైత్రమై వచ్చే భాష నా తెలుగుభాష 

రచన : గీత