Facebook Twitter
ఒంటరిగానే...

ఈ లోకంలోకి వస్తాం ఒంటరై
కుటుంబం తోడుగా పయనం
ఏదుగుతున్నపుడు 
లోకంలో మనమెంటో 
మన బతుకేంటో భవిష్యత్తేంటో
మనకు మనమే తేల్చుకోవాలి
మనల్ని మనమే అంచనా వేసి
మనుగడను మలచుకోవాలి

ఓడినపు ఒంటరై పోవచ్చు
కానీ అంతర్గతంగా
మనమెంటో మనకే తెలుసు
శక్తిని కూడదీసుకుని
దూసుకుపోవాలీ..
గమ్యం చేరుకోవాలి

 

సి.సాయికుమార్