డబ్బు చెబుతుంది

డబ్బు చెబుతుంది
అందరినీ మరిచి నన్ను సంపాదించమని
సమయం చెబుతుంది
అన్నింటినీ మరిచి నన్ను అనుసరించమని
భవిష్యత్తు చెబుతుంది అన్నింటినీ మరిచి నా కోసం శ్రమించు అని
కానీ దేవుడు చెబుతాడు అందరికీ మంచి చేస్తూ ఉండు నీకేం కావాలో నేను చూసుకుంటానని
నీ గమ్మం చేరే దారిలో ఈర్ష్య పడే కళ్ళుంటాయి ఎత్తిచూపే వేళ్ళుంటాయి వ్యంగంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి
బెదిరావో నీ గమ్యం చేరలేవు సాగిపో నిరంతరంగా పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు కష్టం ఎప్పుడు వృధా పోదు
ఈ ప్రపంచంలో మనిషికి విలువ ఇచ్చేవి
ఒకటి ప్రాణం రెండు డబ్బు విచిత్రం ఏమిటంటే డబ్బు వచ్చాక ప్రాణం ఉండదు ప్రాణం ఉన్నప్పుడు డబ్బు ఉండదు
అందుకే ఉన్నదాంట్లో ప్రాణం ఉన్నంతవరకు సంతోషంగా ఉండటమే జీవితం
....చందమామ బాబు



